మచిలీపట్నం మేయర్ అభ్యర్ది ఖరారు - టీడీపీ రెండో జాబితా విడుదల..!!
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్దులను టీడీపీ ప్రకటించింది. ఇప్పటికే ఏడు కార్పోరేషన్లు... 29 మున్సిపాల్టీలకు అభ్యర్దులను ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు రెండో జాబితాలో మచిలీపట్నం కార్పోరేషన్ తో పాటుగా మరో 21 మున్సిపాల్టీలకు అభ్యర్దులను ఖరారు చేసింది. రేపు (ఆదివారం) నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఈ రోజు పూర్తి జాబితా ప్రకటించనుంది. కాగా.. గుంటూరు, ఒంగోలు మేయర్ అభ్యర్దుల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
తెలుగు దేశం నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితాను టీడీపీ ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత పార్టీ నుంచి పోటీ చేసే కార్పోరేషన్ మేయర్.. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్దులను ఖరారు చేసారు. అందులో భాగంగా మచిలీపట్నం మేయర్ అభ్యర్దిగా షేక్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రకటించారు. మరో 21 మున్సిపాలిటీలు- నగర పంచాయతీలకు అభ్యర్ధులను ఖరారు చేసారు. ఆదోని - నిలోఫర్ షేక్, బేతంచెర్ల - ఇ. రాకేష్ గౌడ్, బుచ్చిరెడ్డిపాలెం - దొడ్డా విజయలక్ష్మి, చీరాల - యెద్దుల హరి సుధన, డోన్ - కొట్టె సుజాతమ్మ, గుత్తి - గొల్లపెద్దరాజులు తుమ్మిక్ సెల్వి, గుంతకల్లు - యు.జోష, జంగారెడ్డిగూడెం - రొంగల అనూష పేరు ప్రకటించారు.

కాగా, కదిరి - షేక్ సమీరా.. కళ్యాణదుర్గం - బుట్టి లక్ష్మి, కొండపల్లి - కన్నెకంటి అమూల్య, కొవ్వూరు - జొన్నలగడ్డ రాధారాణి, నాయుడుపేట - పశ్కూరా, నందిగామ - శాకమూరి వర్షధర్, నందికొట్కూరు - ఈ.ఎం. సుబ్బన్నస్వామి, నరసీపట్నం - చింతకాయల పద్మావతి, జగ్గయ్య పేట - నంద్యాల రామస్వామిరెడ్డి, వెంకటగిరి - దొంతు శారద, ఉదయగిరి - చేదిరెడ్డిపాటి ప్రవీణ్ కుమార్, ఎలేశ్వరం - యారగడ్డ అక్షిత, ఎమ్మిగనూరు - మాచాని సునీత పేర్లు ప్రకటించారు. కాగా.. గుంటూరు, ఒంగోలు మేయర్ అభ్యర్ధుల పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. సమీకరణాలు.. కూటమి పార్టీల సమన్వయం ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. పెండింగ్ స్థానాల పేర్లు ఈ సాయంత్రంలోగా ప్రకటించనున్నారు.













Click it and Unblock the Notifications
