వైద్యవిద్యార్థుల కార్ రేసింగ్.. భార్య మృతి, భర్త సీరియస్, బిడ్డ పరిస్థితి దారుణం!

మహబూబ్‌నగర్ జిల్లాలో యువకుల అతివేగం, కారు రేసింగ్ సరదా ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త తీవ్రంగా గాయపడగా, చిన్నారి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

అమిస్తాపూర్‌కు చెందిన షాకీర్ టైలర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన తన భార్య షహానాబేగం 40, కుమార్తె ఆయారాతో కలిసి ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న బంధువు వివాహానికి బయలుదేరారు. అమిస్తాపూర్‌లోని యూపీఎస్ పాఠశాల సమీపంలో మలుపు వద్దకు చేరుకున్న సమయంలో వేగంగా వచ్చిన రెండు కార్లు ఒకదాని వెంట ఒకటి వారి బైక్‌ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో షహానాబేగం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

Car Racing Accident Woman Killed in Mahabubnagar Car Racing Accident Near Bhuthpur Husband Critical

ప్రమాదంలో షాకీర్‌కు రెండు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. తల్లి ఒడిలో ఉన్న చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను, మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు రెండు కార్లలో పోటాపోటీగా అతివేగంతో వెళ్తుండటమే ప్రమాదానికి కారణం.

ప్రమాదం జరిగిన వెంటనే ఒక కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరో కారులో ఉన్న వ్యక్తులను వాహనంతో సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూత్పూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద కేసు నమోదైంది. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో కారు వెళ్లిపోవడంతో ఆ వాహనం, నడిపిన వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది.

రోడ్లపై అతివేగం, రేసింగ్ సరదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో యువకులు కార్లతో రేసింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. రోడ్డు భద్రత నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపడం వల్ల నిండు ప్రాణాలు సమాధి అవుతున్నాయి.

ఆ నగరంలో ఐటీ టవర్స్.. శుభవార్త చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు!
ఆ నగరంలో ఐటీ టవర్స్.. శుభవార్త చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు!

ప్రజలు వేగాన్ని నియంత్రించుకోవాలని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.షహానాబేగం మృతి కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. భర్త చికిత్స పొందుతుండగా, చిన్నారి తల్లిని కోల్పోయింది. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+