శ్రీధర్ బాబుపై టిజి సానుభూతి, మా ఎంపీల వల్లే: పితాని

మా ఎంపీల అతి విశ్వాసం వల్లే: పితాని
తమ పార్టీకి చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల అతి విశ్వాసం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి పితాని సత్యనారాయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీల సంకల్ప దీక్ష సమైక్యాంధ్రకు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బాబు అండతోనే: భూమన
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అండతోనే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెసు ఏర్పాటు చేస్తోందన్నారు.
శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. వాయిదా అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్, మహీధర్ రెడ్డి, పితాని సత్యనారాయణ తదితరులతో భేటీ అయ్యారు.
సంకల్ప దీక్ష
సంకల్ప దీక్ష కోసం సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్ ఇందిరా పార్కు వద్దకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు దీక్ష చేపడతామన్నారు. విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజాభిష్టానికు అనుగుణంగానే దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని ఎవరూ విడదీయలేరన్నారు.












Click it and Unblock the Notifications