"థ్యాంక్యూ సీఎం జగన్"- స్టార్ హీరోల వరుస ట్వీట్లు : సోషల్ మీడియాలో ట్రెండింగ్..!!

ఏపీ సీఎం జగన్ పేరుతో స్టార్ల ట్వీట్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఏపీలో సినీ సమస్యలపైన సీఎం జగన్ తో స్టార్ హీరోలు సమావేశమయ్యారు. సమావేశంలో జగన్ ఇచ్చిన హామీల పట్ల వారంతా హర్షం వ్యక్తం చేసారు. సమావేశంలో పాల్గొన్న హీరోలు వరుసగా ట్వీట్లు చేసారు. వారితో పాటుగా దర్శకుడు రాజమౌళి సైతం జగన్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు. సినీ పరిశ్రమ ప్రముఖులు కోరుకుంటున్నట్లుగా సీఎం జగన్ అటు ప్రేక్షకులకు భారం లేకుండా.. సినీ పరిశ్రమకు మేలు చేసే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారు.

జగన్ నిర్ణయాల పై థాంక్స్ ట్వీట్లు

జగన్ నిర్ణయాల పై థాంక్స్ ట్వీట్లు

అదే సమయంలో అయిదో షో కు...బెనిఫిట్ షోలకు అనుమతి పైన సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. దీంతో.. 'థ్యాంక్యూ సీఎం', 'థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌' అంటూ స్టార్ల ట్వీట్‌లు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేసిన వారు.. సోషల్‌ మీడియా వేదికగా మరోసారి తెలిపారు. చిరంజీవి , మహేశ్‌బాబు , ప్రభాస్‌ తమ ట్వీట్లలో 'థ్యాంక్యూ సీఎం' , 'థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌' అంటూ ట్యాగ్ చేసారు. ఇప్పుడు ఈ హ్యాష్‌ట్యాగ్‌లే భారీగా ట్రెండ్ అవుతున్నాయి.

‘థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌' అంటూ ట్యాగ్

‘థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌' అంటూ ట్యాగ్

సమావేశం తరువాత ఆ భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖులు వరుసగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తరువాత సోషల్ మీడియా ద్వారా కూడా ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి, మహేశ్‌బాబు, రాజమౌళి తదితరులు ట్విటర్‌లో సీఎం, మంత్రి పేర్నినానికి థ్యాంక్స్‌ చెప్పారు. 'థ్యాంక్యూ వైఎస్‌ జగన్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ఇక, వీరి ట్వీట్లను పెద్ద సంఖ్యలో అభిమానులు లైక్ లు చేస్తూ..రీట్వీట్ చేస్తున్నారు. ఒకే ఫ్రేమ్ లో ప్రముఖ హీరోలు ఒకే చోట కనిపించటం తో హీరోల ఫ్యాన్స్ ఖుషీగా పోస్టింగ్ లు పెడుతున్నారు. ఆ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు..వీడియోలను భారీగా షేర్ చేస్తున్నారు.

అనకూల పోస్టుల హోరు

అనకూల పోస్టుల హోరు

తమ హీరోలు చేసిన ట్వీట్లు..అవే హ్యాష్ ట్యాగ్ లతో షేర్ చేస్తుండటంతో ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్... "థ్యాంక్యూ సీఎం" అంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఇప్పటి వరకు సినీ పరిశ్రమ ఏపీ సీఎం జగన్ కు దూరం అయిందని ప్రచారం సాగుతున్న వేళ...ఒక్క సారిగా వచ్చిన ఈ మార్పు.. ప్రముఖ హీరీలు జగన్ ను ప్రశంసిస్తూ చేస్తున్న ట్వీట్లు రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇక, సీఎంతో భేటీ ...నిర్ణయాలు పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నాయి. వైసీపీ గ్రూపుల్లోనూ ఈ ఫొటోలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి.

హ్యాష్ టాగ్స్ తో ట్రెండింగ్

హ్యాష్ టాగ్స్ తో ట్రెండింగ్

ఒక్క సారిగా అన్ని సమస్యలకు సీఎం జగన్ పరిష్కారం చూపించారంటూ పోస్టింగులు దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో విశాఖ కేంద్రంగా కొత్తగా స్టూడియోలు... వాళ్లకు స్థలాల కేటాయింపు.. ఏపీలో 20 శాతం షూటింగ్ జరపాలనే అంశాల పైన ఎవరి అభిప్రాయాలు వారు షేర్ చేస్తున్నారు. ఇవి నిజంగా అమల్లోకి వస్తాయా అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా..అలా జరిగితే ఏపీకీ ప్రయోజనకరమే అంటూ మరి కొంత మంది సమాధాన మిస్తున్నారు. దీంతో..ఇప్పుడు మొత్తంగా సోషల్ మీడియాలో ప్రముఖంగా ఏపీ ప్రభుత్వం .. సినీ పరిశ్రమ చుట్టూ వార్తలు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+