ఆ జడ్జి పిరికివాడులా -రఘురామ-లోకేష్ చాటింగ్ లో: సుప్రీంలో ఏపీ పిటీషన్ లో సంచలనాలు..!!
వైసీపీ ఎంపీ రఘురామ రాజు వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో పలు సంచలన విషయాలను పేర్కొంది. ఇప్పటికే ఆ అఫిడవిట్ లోని అంశాలు బయటకు వస్తున్నాయి. సీఎం జగన్ బెయల్ రద్దు పిటీషన్ వ్యవహారంలో రఘురామ రాజు - చంద్రబాబు మధ్య సాగిన చాటింగ్ గురించి సీఐడి పేర్కొన్న అంశాలను ప్రచురించిన జగన్ కుటుంబ సభ్యుల మీడియా, తాజాగా.. రఘురామ రాజు- లోకేష్ మధ్య సాగిన కోర్టు వ్యవహారాల చాటింగ్ ను బయట పెట్టింది.

ఆ జడ్జి పిరికివాడులా అంటూ..
అందులో న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చాటింగ్ లో ఉన్నట్లుగా పేర్కొంది. ఆ కధనం ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టులో కేసు విచారణనను ఆన్ లైన్ వీక్షిస్తూ వీరిద్దరూ చాటింగ్ చేసినట్లు వివరించారు. ఆ సమయంలో రఘురామ కోర్టు విచారణలో మీకు అంతా మంచే జరగాలి అంటూ..అవసరమైతే మనం సుప్రీంలో హౌస్ మోషన్ వేసేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. న్యాయస్థానం చీఫ్ పిరికివాడిలా ఉన్నారంటూ కామెంట్ చేసినట్లుగా పేర్కొన్నారు.

ఆ జడ్జి రాయలసీమ రెడ్డి కదా..
చీఫ్ జస్టిస్ మన సీనియర్ న్యాయవాది వాదనకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రఘురామ చెప్పగా.. న్యాయమూర్తి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా ఉన్నారని లోకేష్ కామెంట్ చేసారు. ఆ సమయం లో రఘురామ.. చివరికి వచ్చేసరికి ఆయన రాయలసీమ రెడ్డి కదా..అన్నట్లుగా కధనంలో పేర్కొన్నారు. కానీ, ఆయన్ను పట్టించుకోరంటూ చెప్పుకొచ్చారు. చెయిర్ (న్యాయమూర్తి స్థానం)లో కూర్చుని ఆయన ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. చీప్ ఫెలో అంటూ ఆ చాటింగ్ లో భాగంగా కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆ న్యాయమూర్తిని పంపించివేయాలి..
దీనికి కొనసాగింపుగా నాటి సీజే ప్రవీణ్ ను పంపించి వేయాలి అంటూ రఘురామ కామెంట్ చేసినట్లుగా వివరించారు.ఆ కేసులో వాదనలు కంటిన్యూ అవుతుండగానే..అక్కడ వాదనలకు అనుగుణంగా రఘురామ - లోకేష్ మధ్య చాటింగ్ కొనసాగింది. దీనిని సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ ఆధారంగా సేకరించినట్లుగా చెబుతున్నారు. ఆ కేసులో లోకేశ్ కు రఘురామ ముందస్తు గ్రీటింగ్స్ కూడా చెప్పినట్లుగా వివరించారు. ఇప్పటికే సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను రఘురామ టీడీపీ అధినేత కు షేర్ చేసారని..వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను నిన్ననే బయట పెట్టారు.
Recommended Video

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా..
దీని పైన రఘురామ సైతం స్పందించారు. ఇప్పుడు రఘురామ - లోకేష్ చాటింగ్..అందునా న్యాయమూర్తి గురించి వారిద్దరి మధ్య జరిగిన చర్చను బయటకు తీసుకొచ్చారు. ఈ వరుస వ్యవహారాలతో రాష్ట్రంలో ఇప్పుడు రఘురామ సెల్ ఫోన్ లో చంద్రబాబు- లోకేష్ తో జరిగిన చాటింగ్ అంశాలు రాజకీయంగా దుమారానికి కారణమవుతున్నాయి. ఇప్పడు చాటింగ్ కు సంబంధించిన ఆధారాలు సీఐడి సిద్దం చేసిందని తెలుస్తోంది. దీని పైన ఇప్పుడు రఘురామ ..ఇటు టీడీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications