జగన్ రాజకీయాల్లో ఎందుకు రాణించకలేకపోతున్నారంటే..: షాకిచ్చిన జేసీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అనంతపురం టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ చాలా పొగరుబోతు నేత అన్నారు. అందుకే రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలోని రైతులకు సాగునీటిని అందిస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయమని చెప్పారు.

2018-19 ఏడాదికి జిల్లాలోని అన్ని గ్రామాలకు నీరందిస్తారని, అమరావతి - అనంతపురం హైవే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు రెట్టింపు పరిహారం ఇచ్చేలా కృషి చేస్తానని జేసీ చెప్పారు.

jc diwakar reddy

ఆయన జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కాగా, వైసిపి అధినేత జగన్ పైన జేసీ సోదరులు గత కొద్ది రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో కొద్ది రోజుల క్రితం దివాకర్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై పదిమంది వరకు మృతి చెందారు. అప్పుడు జగన్ హడావుడి చేశారని, జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు కూడా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party MP JC Diwakar Reddy on Sunday revealed why YSR Congress Party chief YS Jaganmohan Reddy is still struggling in politics.
Please Wait while comments are loading...