నేను మోనార్క్, ఎవ్వరి మాట వినను, ఎగిరెగిరిపడ్డాడు, నారా లేకేష్ దెబ్బకు సీఐడీ ఎంట్రీ

గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టప్రకారం ఆడిన ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తించడంతో సాటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా, ఉద్యోగ సంఘాలు చేస్తున్న మనవిని గాలికి వదిలేసి, అధికార పార్టీఎమ్మెల్యేలు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినా ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆయన తీరు మాత్రం మార్చుకోవడం లేదు.

తిరుపతి డీఈఓపై సీఐడీ విచారణకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి డీఈఓపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా విద్యాశాఖ డీఈఓ అలాగే ప్రవర్తించడం తీవ్రచర్చకు దారి తీసింది.

The Andhra Pradesh government has decided to order an inquiry against the DEO of Chittoor district

నేను మోనార్క్, నేను ఎవ్వరి మాట వినను అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో ఆ డీఈఓపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుపతి డీఈవో పై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ అయిన తరువాత కూడా పక్క జిల్లాకు చెందిన మరో డీఈఓ ఇలాగే ప్రవర్తించడం హాట్ టాపిక్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారస్సు లేఖలు తీసుకొచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకి డీఈఓ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏడీగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి చిత్తూరు జిల్లా డీఈఓగా ప్రమోషన్ ఇస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏడీ నుంచి డీఈఓగా ప్రమోషన్ తీసుకున్న ఆ అధికారి ఆ తర్వాత ప్రభుత్వ టీచర్లు, విద్యాశాఖ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం లో ఆ పార్టీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశాడు.

The Andhra Pradesh government has decided to order an inquiry against the DEO of Chittoor district

చిత్తూరు డీఈఓ ఒక్కోసారి విద్యశాఖ ఉద్యోగులను కూడా చాలా చులకనగా చూసేవారని ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ అధికారులకు చిత్తూరు డీఈఓపై ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు డీఈఓకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో తన పైన విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు చేసిన ఉద్యోగులకి డీఈఓ నోటీసులు జారీ చేశారు.

విద్యా శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్ డీఈఓకి ఫోన్ చేసి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పినా ఆయన మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఈఓపై వ్యతిరేకత రావడంతో ఆయన బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారి డిసైడ్ అయ్యారు అని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+