వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుకు అనుమతి ఇవ్వండి - కేంద్రానికి ఏపీ అభ్యర్ధన : ఓవర్ డ్రాఫ్టులో రాష్ట్రం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వ ఆర్దిక కష్టాలను ఎదుర్కోవటానికి అప్పులను నమ్ముకుంటోంది. పెరిగిపోతున్న ఖర్చులు ..పథకాల నిర్వహణ కలిసి ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్దిక కష్టాలను పెంచుతోంది. తాజాగా పార్లమెంట్ లో సైతం ఏపీ అర్దిక పరిస్థితుల పైన చర్చ జరిగింది. ఏపీలో ఆర్దిక క్రమశిక్షణ పాటించటం లేదంటూ కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇక, ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ నెలలో నిర్వహణ లో భాగంగా.. కొత్తగా అప్పు కోసం కేంద్ర అనుమతి కోరుతోంది. ఈ అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం నిరీక్షిస్తోంది.

కొత్త రుణ సమీకరణ కోసం

కొత్త రుణ సమీకరణ కోసం


ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఓవర్‌ డ్రాఫ్టులో ఉంది. రూ.1,400 కోట్ల ఓడీ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించు కుందని చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరంలో 9 నెలలు ముగియడంతో కేంద్రం నుంచి కొత్త రుణ పరిమితి కోసం ఎదురుచూస్తోంది. ఈ నెలాఖరుకు అది రావచ్చని అంచనా. నెలకు సగటున రూ.4,000 కోట్ల వరకు ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి రుణం పొందుతూ అవసరాలు తీర్చుకుంటోంది. డిసెంబరు నెలాఖరుకు కేంద్రం ఇచ్చిన రుణపరిమితి మేరకు అప్పులు తెచ్చుకుని రాష్ట్రం వాడేసింది. మరోవైపు కార్పొరేషన్ల పేరిట కొత్త రుణాల సమీకరణ ప్రయత్నాలు మొదలయ్యాయి.

కార్పోరేషన్ల ద్వారా రుణాలు

కార్పోరేషన్ల ద్వారా రుణాలు

ప్రభుత్వం తన గ్యారంటీల పరిమితిని చట్ట సవరణ ద్వారా రెవెన్యూ రాబడిలో 90% నుంచి 180%కు పెంచుకుంది. ఈ క్రమంలో పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్లు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కొత్తగా గ్యారంటీలు రావడంతో ఈ అనుమతులు మంజూరవుతున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడి రూ.1,18,063 కోట్లు. అందులో 180% అంటే రూ.2.12 లక్షల కోట్ల వరకు కార్పొరేషన్లు అప్పులు చేసుకోవచ్చు. అయితే, ఈ ఆర్దిక సంవత్సరంలో రెండు దఫాలుగా కేంద్రం తొలి విడతలో రూ 20,751.51 కోట్లు.. రెండో విడతలో రూ 10,500 కోట్లకు ఏపీప ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

కేంద్రం అనుమతి ఇస్తేనే..

కేంద్రం అనుమతి ఇస్తేనే..


అయితే, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాటిని వినియోగించుకుంది. బహిరంగ మార్కెట్‌ రుణానికి, మూలధన వ్యయానికి ముడిపెట్టిన కేంద్రం.. రూ.5,309 కోట్ల మేర కోత పెట్టింది. తొలి మూడు నెలల తర్వాత మూలధనం తీరును సమీక్షించి రూ.2,655 కోట్ల మేర ప్రభుత్వానికి రుణ అవకాశం కల్పించింది. ఇప్పుడు కేంద్రం చెప్పినంతగా రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం చేయలేదు. దీంతో ఆ మేరకు రుణ పరిమితిని పొందే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన- రెవెన్యూ లోటుతో ముడిపెడుతూ ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. దీని పైనే రెండు రోజుల క్రితం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసారు. కేంద్రం తాజాగా అనుమతి ఇస్తే..ఏపీకి ఆర్దికంగా అప్పు సమీకరణ ద్వారా కొంత ఊరట లభించనుంది. అయితే, కేంద్రం ఈ రోజు లేదా రేపు దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

English summary
The AP government is seeking central approval for the new loan, waiting for this approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X