పరాగ్ సీరియస్, వైభవ్ కన్నీటి పర్యంతం..!?
Vaibhav Sooryavanshi IPL 2026 సంచలనం. మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్ విన్యాసాలతో తన వైపు తిప్పుకున్నాడు. క్వాలిఫైర్ -2 లో సైతం బ్యాటర్లు అందరూ వరుసగా అవుట్ అవుతున్నా... 96 పరుగులు చేసాడు. వరుసగా రెండో సారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ సమయంలోనే డగౌట్ లో వైభవ్ కన్నీటి పర్యంతమైన వీడియో వైరల్ అవుతోంది. కెప్టెన్ పరాగ్ అవుట్ అయిన వైభవ్ తో సీరియస్ అయినట్లుగా వీడియోలో స్పష్టం అవుతోంది. కాగా, మ్యాచ్ లో ఆర్ఆర్ ఓటమి తరువాత గ్రౌండ్ లోనే వైభవ్ ఆవేదనతో కనిపించాడు.
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద ఔట్ కాగా.. తాజాగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో 96 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రెండు మ్యాచ్‌లోనూ అతడు తొంబైల్లోనే ఔట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో 47 బంతులు ఆడిన వైభవ్ 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. రబాడ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.

రెండో సారి సెంచరీ మిస్.. మ్యాచ్ లో ఓటమితో
https://twitter.com/thecamgreen/status/2060539906989154655కాగా, అవుట్ అయిన వైభవ్ తో డగౌట్ లో కెప్టెన్ రియాన్ పరాగ్ సీరియస్ గా మాట్లాడుతున్న సీన్లు లైవ్ లో కనిపించాయి. ఆ కేసపటికే వైభవ్ కన్నీటి పర్యంతం అయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, పరాగ్ సీరియస్ కాలేదని.. సెంచరీ చేజార్చుకోవంతో పాటుగా భారీ స్కోరు సాధించే అవకాశం టీం కు మిస్ అవ్వటం పైన మాట్లాడరని.. అప్పటికే చెప్పినా.. ఎందుకు థర్డ్ మెన్ వైపు గాల్లోకి కొట్టావని ప్రశ్నించినట్లు కామెంట్స్ వస్తున్నాయి. అయితే.. ఈ సిరీస్ లో తన టీం కు వెన్నుముక లా నిలిచిన వైభవ్ చివరి వరకు తన వంతు పాత్ర పోషించాడు. ఫైనల్ కు చేరకుండానే వెనుదిగరటం తో ఆవేదనకు గురయ్యాడు. సహచర ఆటగాళ్లు అతడిని ఓదార్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైభవ్ మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి, పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో 700కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు.













Click it and Unblock the Notifications