ఏపీకి వెళ్తున్న పర్యాటకులకు తీపికబురు.. దేశంలోనే తొలిసారిగా కొత్త టూరిస్ట్ విధానం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకంగా అభివృద్ధి పైన కూడా ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను ఆధునీకరిస్తూ కారవాన్ టూరిజం, హోం స్టే వంటి సరికొత్త విధానాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా 'డ్రైవర్ కమ్ గైడ్' పేరుతో ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఏపీ పర్యాటక శాఖ, ర్యాపిడో సంయుక్తంగా డ్రైవర్ కమ్ గైడ్ విధానం
ఏపీ పర్యాటక శాఖ, రెయిడ్ హెయిలింగ్ సంస్థ ర్యాపిడో కలిసి ఈ డ్రైవర్ కమ్ గైడ్ విధానాన్ని అమలు చేయనున్నాయి. ర్యాపిడోలోని ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లను ఎంపిక చేసి వారికి టూరిస్ట్ గైడ్ లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో భాగంగా పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి, విశిష్టతతో పాటు, ముఖ్యమైన అనేక అంశాలను, పర్యాటకులతో వ్యవహరించే విధానాన్ని, భద్రతను నేర్పిస్తారు.

280 మంది ర్యాపిడో డ్రైవర్లకు శిక్షణ
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా విజయవాడలో మొదలుపెట్టారు అధికారులు. మొత్తం 248మంది ఆటో డ్రైవర్లకు, 32 మంది క్యాబ్ డ్రైవర్లకు కలిపి మొత్తం 280 మంది ర్యాపిడో డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. మీరంతా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన వారు. శిక్షణలో భాగంగా వీరికి విజయవాడ సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అంతే ఆసక్తికరంగా ఎలా వివరించారో స్క్రీన్ పైన వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
ర్యాపిడో యాప్ లో టూరిస్ట్ గైడ్ ఆప్షన్
వీరి ద్వారా ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రణాళికలను చేస్తున్నారు. ర్యాపిడో యాప్ లో టూరిస్ట్ గైడ్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చి, ఆ విధానంలో బుక్ చేసుకోవడానికి పర్యాటకులకు ఆప్షన్ ఇస్తున్నారు. యాప్ తెరవగానే అక్కడి దాదాపు 20 పర్యాటక ప్రాంతాలు కనిపిస్తాయి.
ఏపీలో ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా?
వాటిని పర్యాటకులు ఎంపిక చేసుకుంటే, శిక్షణ పొందిన డ్రైవర్ గైడ్ లు తమ వాహనాలలో వారికి గైడ్ చేస్తారు. విదేశీ పర్యాటకుల కోసం గూగుల్ ట్రాన్స్ లేట్, ఇతర భాష యాప్ ల వినియోగం పైన కూడా శిక్షణ ఇస్తున్నారు. ఏపీలో ఈ ప్రోగ్రాం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
-
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications