Janmabhoomi Super Fast Express: జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!
హైదరాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. రైలు స్టార్ట్ అయిన రెండు నిమిషాల్లోనే బోగీలు విడిపోయాయి. వెంటనే గమనించిన సిబ్బంది రైలును ఆపారు. దీంతో ప్రయాణికులు ఊపరి పీల్చుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ లోని లింగంపల్లి నుంచి విశాఖపట్నానికి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను నడుపుతోంది. బుధవారం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బయల్దేరింది.
రైలు స్పీడ్ అందుకుంటున్న క్రమంలో రైలు ఏసీ బోగీలు రైలు నుంచి విడిపోయాయి. దీంతో వెంటనే రైలు ఆపారు. రైలును వైజాగ్ స్టేషన్ కు తిరిగి తీసుకొచ్చారు. బోగీలను రైలు జాయింట్ చేసి రైలు తిరిగి పంపించారు. రైలు ప్రయాణించిన 2 నిమిషాల తర్వాత సాంకేతిక లోపంతో 2 బోగీలు విడిపోయాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. బోగి లింక్ లు ఏలా విడిపోయాయని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

రైల్వే సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ రైలు స్పూడ్ అందుకున్న తర్వాత బోగీలు ఊడిపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications