ఏపీకి కేంద్రం జలక్ - ఏడు రాష్ట్రాలకు రుణఅర్హత : ఏపీకి దక్కని పరపతి-ఏం జరిగింది...!!

ఆర్దికంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏపీ ప్రభుత్వానికి మరో జలక్ తగిలింది. సంపద సృష్టి లో విఫలమైన కారణంగా అదనపు రుణ పరిమితికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. నిర్దేశించిన మూలధన వ్యయం లక్ష్యాలను అధిగమించి ఉంటే సుమారు రూ.6 వేల కోట్ల అదనపు రుణ పరపతి లభించేది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి.. మూలధన వ్యయ లక్ష్యాలను ఏడు రాష్ట్రాలు సాధించటంతో వాటికి అదనపు రుణ పరపతికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అందులో తెలంగాణతో సహా చత్తీస్ ఘడ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి.

అదనపు రుణ సేకరణకు అనుమతి నిరాకరణ

అదనపు రుణ సేకరణకు అనుమతి నిరాకరణ

ఈ రాష్ట్రాలకు ఓపెన్ మార్కెట్ లో అదనంగా రుణాలు తెచ్చుకోవటానికి కేంద్ర అనుమతి లభించింది. ఈ ఏడు రాష్ట్రాలకు మొత్తం రూ.16,691 కోట్లకు అనుమతించగా.. ఇందులో తెలంగాణ రూ.5,392 కోట్ల వరకు అప్పు తెచ్చుకోవచ్చు.

ఛత్తీస్ గఢ్‌ రూ.895 కోట్లు, కేరళ-రూ.2,256 కోట్లు, మధ్యప్రదేశ్‌- రూ.2,590 కోట్లు, మేఘాలయ-రూ.96 కోట్లు, పంజాబ్‌-రూ.2,869 కోట్లు, రాజస్థాన్‌ రూ.2,593 కోట్ల చొప్పున అదనపు రుణాలు పొందడానికి అర్హత సాధించాయి. తొలి త్రైమాసికంలో మూలధన వ్యయ లక్ష్యాలను సాధించిన 11 రాష్ట్రాలకు గడచిన సెప్టెంబరు నెలలో రూ.15,721 కోట్ల అదనపు రుణాల సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

కొత్త అప్పుల కోసం ప్రయత్నాలు

కొత్త అప్పుల కోసం ప్రయత్నాలు

వీటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. మూలధన వ్యయ లక్ష్యాల పురోగతికి సంబంధించి మళ్లీ మూడో దశ సమీక్ష 2022 మార్చిలో నిర్వహించనున్నారు. చివరి సమీక్ష 2022 జూన్‌లో జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలి త్రై మాసికంలో అర్హత సాధించిన ఏపీ, రెండో త్రై మాసికంలో మాత్రం వెనుకబడింది. ఇక, ఇదే సమయంలో కొత్తగా రూ.16,000 కోట్లు అప్పుకు అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పుడు రాష్ట్రంవద్ద రూ.1150 కోట్ల అప్పు పరిమితి మాత్రమే మిగిలి ఉంది. దీంతో మళ్లీ కొత్త అప్పుల కోసం మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ సెక్రటరీ ప్రయత్నిస్తున్నారు.

మూలధన వ్యయంలో విఫలమవ్వటంతో

మూలధన వ్యయంలో విఫలమవ్వటంతో

దాదాపు రూ.5,000 కోట్ల మేర మూలధన వ్యయం చేయడంలో ఏపీ విఫలమైంది. 2020-21లో రూ.27,000కోట్ల మూలధన వ్యయం చేయాలని కేంద్రం రాష్ట్రానికి నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకున్న రాష్ట్రాలకు జీఎస్ డీపీలో 0.5 శాతం మేర అదనపు అప్పులకు అనుమతిస్తామని ప్రకటించింది. ఏపీకి సంబంధించి ఈ 0.5శాతం విలువ దాదాపు రూ.5,500కోట్లు. రాష్ట్రాల మూలధన వ్యయాలను ప్రతి 3నెలలకొకసారి సమీక్షించి లక్ష్యాలు చేరుకున్న రాష్ట్రాలకు అదనపు అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తూఉంది.

Recommended Video

    AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu
    ఆర్డిక కష్టాలతో ఉక్కిరి బిక్కిరి

    ఆర్డిక కష్టాలతో ఉక్కిరి బిక్కిరి

    దీని ప్రకారం సెప్టెంబరు 30నాటికి 45 శాతం మూలధన వ్యయం చేయాలి. కానీ, ఏపీ చేయలేదు. దీంతో..ఈసారి అదనపు అప్పులకు కేంద్రం అనుమతివ్వలేదు. ఇప్పటివరకు ఏపీ రూ.8,000కోట్లు మాత్రమే మూలధన వ్యయం చేసింది. కానీ, రూ.13,000 కోట్ల మూలధన వ్యయం చేస్తే ఎంత అదనపు అప్పు లభిస్తుందో అంతపరిమితిని కేంద్రం ముందుగానే ఇచ్చేసింది. ఒకవేళ మార్చి 31నాటికి కూడా ఏపీ రూ.13,000కోట్ల మూలధన వ్యయం చేయకపోతే.. అదనంగా ఇచ్చిన అప్పులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే అప్పుల పరిమితిలో ఆ మేరకు కోత విధించే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+