కేంద్ర బృందానికి పిన్ టూ పిన్ వివరించిన అధికారులు, చంద్రబాబు ఆదేశాలతో !

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద నష్టంపై అధికారుల ప్రాథమిక నివేదిక రూపొందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏడు జిల్లాలలో భారీగా నష్టం జరిగిందని సంబందిత అధికారులు కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు.

కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వరదల దెబ్బకు అతలాకుతలం అయిన విజయవాడ నగరం పరిస్థితిని సంబందిత అధికారులు కేంద్ర బృందానికి ప్రత్యేకంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక, పునరావాస చర్యలపై సంబంధిత అధికారులు కేంద్ర బృందానికి నివేదిక అందజేశారు.

The central team is informed about the damage caused due to heavy rains and floods

వరదలు, భారీ వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. ఎన్ డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన, ఆర్మీ హెలికాప్టర్ల సహాయం చేపట్టామని సంబంధిత అధికారులకు కేంద్ర బృందానికి వివరించారు. త్వరగతిన పారిశుద్ధ్య పనులు, సహాయక చర్యలు చేపట్టామని, హెలికాప్టర్ ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, తాగునీరు, పాలు బిస్కెట్లు పంపిణీ చేశామని సంబంధిత అధికారులకు కేంద్ర బృందానికి వివరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలు, ఫోటోలను కేంద్ర బృందం ఎదుట అధికారులు ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లిందని సంబంధిత అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశం అయ్యింది. శాఖల వారీగా అధికారులు భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి వివరించారు. అధికారుల నుండి పూర్తి సమాచారం తెలుసుకున్న కేంద్రం బృందానికి ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+