ఆ రోజు జగన్ ను నమ్ముకున్నాడు, ఈ రోజు మాజీ ఐజీ కేసుల్లో ఇరుక్కున్నాడు, దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా పని చేసిన రామకృష్ణ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించింది. గవైసీపీ ప్రభుత్వంలో హయాంలో రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ అడ్డుగోలుగా వ్యవహరించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించి గత వైసీపీ నాయకులకు లబ్దీ చేకూరేలా రామకృష్ణ పని చేశారని వెలుగు చూసింది.
హైదరాబాద్, నాసిక్ ప్రభుత్వ ముద్రణ సంస్థల నుంచి రూ. 10, రూ20, రూ 50, రూ 100 రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు తెప్పించి రాష్ట్రంలో విక్రయించడం దశాబ్దాల కాలంగా జరుగుతోంది ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతి ఏడాది లాభాలు వచ్చేవి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి స్వస్తి చెప్పి ఈ స్టాపింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 50 కోట్ల వరకు వస్తుందని అధికారులు ప్రచారం చేశారు.

భవిష్యత్తులో నాన్ జ్యుడీషియల్ స్టాంపింగ్ పేపర్ల ద్వారా రిజిస్ట్రేషన్ జరగవని, ఈ స్టాపింగ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే అమలులో ఉంటుందని గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను భయపెట్టింది జిరాక్స్ కాగితంలో కనిపించే ఈ స్టాపింగ్ పేపర్లపై రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో ఆస్తులు విక్రయాలు చేసేవారు, ఆస్తులు కొనుగోలు చేసే వాళ్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా గత ఏడాది జనవరిలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది
దీనిపై ఇదే ఏడాది మార్చిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ప్రజల రిజిస్ట్రేషన్ యూజర్ చార్జీల కింద చలానా రూపంలో చెల్లించిన మొత్తం వెంటనే ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యేది. ఈ విధానంలో కూడా గత వైసీపీ ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ప్రజల నుంచి వసూలు చేసే ఛార్జీలు ఉత్తమ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కు వెళుతున్నాయి. మరునాడు ఆ సంస్థ బ్యాంకుకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మసటి రోజు సెలవులు ఉంటే మూడో రోజు ప్రభుత్వ ఖజానాలో ఆ డబ్బు జమ చేస్తున్నారు.
ఇలా ప్రభుత్వానికి వడ్డీ రూపంలో వచ్చేదానికి కూడా గండి పడిందని అధికారులు ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దీనికి తోడు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కి 0.6 శాతం కమిషన్ ని అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని అధికారులు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను బంగారు బాతుగా మార్చుకుందని కూటమి ప్రభుత్వం అంటోంది. అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా పనిచేసిన రామకృష్ణ జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఆయన పదవిని కాపాడుకోవడానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల మార్కెట్ విలువ 9సార్లు పెంచారని అధికారుల దర్యాప్తులో వెలుగుచూసింది.

కొత్త జిల్లాల ఏర్పాటు అనే విషయం అడ్డం పెట్టుకుని చిన్న చిన్న గుడిసెల దగ్గర నుండి బహుళ అంతస్తుల భవనాల వరకు పది రూపాయలు ఉండే ఛార్జింగ్ 100 రూపాయలకు పెంచేశారని కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జారీ చేసిన అనేక ఉత్తర్వుల్లో చాలా లోపాలు ఉన్నాయని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. వీటన్నిటి వెనుక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ ఐజీ హస్తం ఉందని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు జగన్ కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ విశాఖ పనిచేసిన రామకృష్ణ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని, అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ వ్యవహారాలు అన్నింటిపై విచారం జరిపించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మాజీ ఐజీ రామకృష్ణ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications