చంద్రబాబు స్కెచ్ తో వెంటనే రంంలోకి సీఐడీ, ఆ బ్యాచ్ కు తడిచిపోయింది, అప్పటికే ?

చంద్రబాబును నాయుడి రాజకీయ జీవితంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో మొదటిసారి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు. సీఐడీ ఆస్త్రం ముందు పెట్టుకుని తనను జైలుకు పంపించిన వారికి అదే సీఐడీతో బుద్ది చెప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారని తెలిసింది.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే ఈ కేసును పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే గురువారం ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడుగుపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

The CID chief started the investigation at Madanapalle sub collector s office

గురువారం మద్యాహ్నం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ వెంట సీఐడీ అధికారులు కూడా ఉన్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులను సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించిన సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కేసు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆదివారం రాత్రి 11.24 గంటల సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు నిప్పంటంచి తగలబెట్టిన విషయం తెలిసిందే. మంటల్లో రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్లు కాలిపోయాయి. ఈ కేసుకు సంబందించి సెక్షన్ 22-ఏలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల మందు వరకు గౌతమ్ తేజ్ తో పాటు కొందరు ఉద్యోగులు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

The CID chief started the investigation at Madanapalle sub collector s office

ఇప్పటికే గౌతమ్ తేజ్ తో పాటు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గతంలో మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో పని చేసిన పూర్వపు ఆర్డీఓ మురళి, ప్రస్తుత మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్, సబ్ కలెక్టర్ ఆఫీసు ఉద్యోగి గౌతమ్ తేజ్ తో పాటు మొత్తం 37 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు విచారణ చేసి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఉద్యోగులు అందరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇప్పటికే వీరందరి ఫోన్లు సీజ్ చేసిన పోలీసు అధికారులు వారి కాల్ డేటా వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఎవరెవరితో మాట్లాడారు ?, ఎందకు మాట్లాడారు ?, ఏం మాట్లాడారు అని సీఐడీ అదికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా వీళ్లు ఫోన్లు చేసిన అవతలి వ్యక్తులు కొందరిని పోలీసులు పిలిపించి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+