సీఎం సొంత జిల్లాలో స్కామ్, రంగంలోకి దిగిన సీఐడీ, విజయవాడలో ఫైల్స్ ఉన్నాయా ?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దందా పై సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు ఇసుక స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే ఇసుక స్కామ్ వ్యవహారంపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 32 మండలాల్లో ఇసుకను విక్రయించడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2022 డిసెంబర్ నుండి 2023 ఆగస్టు వరకు జేపీ వెంచర్స్ లిమిటెడ్ సంస్థకి, ఆ తర్వాత ప్రతిమా ఇన్ ఫ్రా సంస్థలకి చిత్తూరు జిల్లాలో ఇసుక విక్రయించడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 2024 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో ఇసుకను విక్రయించడానికి అప్పటి జగన్ ప్రభుత్వం ఏ సంస్థకు అనుమతులు ఇవ్వలేదని రికార్డులు చెబుతున్నాయని సీఐడీ అధికారులు అంటున్నారు.

The CID officials accelerated the investigation on the sand scam in Chittoor district

2024లో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షల టన్నుల ఇసుకను బయటకు తీసి విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై నివేదిక ఇవ్వాలని సీఐడీ అధికారులు చిత్తూరు జిల్లా గనుల శాఖ అధికారులకు సూచించారు. అయితే రికార్డులు మొత్తం విజయవాడలోని గనుల శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయని, సంబందిత పత్రాలు కూడా అక్కడే ఉన్నాయని, నివేదిక సమర్పించడానికి సమయం కావాలని చిత్తూరు జిల్లా గనుల శాఖ అధికారులు సీఐడీ అధికారులకు మనవి చేశారని తెలిసింది.

ఆన్ లైన్ లోనే ఎక్కువ శాతం ఇసుక విక్రయించామని ఇంతకాలం పదే పదే గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం నాయకులు ఇప్పుడు అదే ఇసుక విక్రయాల గురించి ఆన్ లైన్ లో సమాచారం పెట్టలేదా అని ప్రజలకి అనుమానం వస్తోంది. చిత్తూరు జిల్లా గనుల శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని, మొత్తం సమాచారం బయటకు లాగుతున్నారని సమాచారం.

The CID officials accelerated the investigation on the sand scam in Chittoor district

గత వైసీపీ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా అనుమతులు తీసుకున్న జేపీ వెంచర్స్ ప్రతిమా ఇన్ ఫ్రా సంస్థలు అక్రమంగా ఇసుకను విక్రయించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేవ్ సీఐడీ అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఎంత మొత్తంలో ఇసుక విక్రయించారు అని సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+