వావ్, టన్ను ఇసుక రూ 326కే, జగన్ ప్రభుత్వంలో టన్ను ఇసుక ఎంతంటే ?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన ఇండ్లు నిర్మించుకుంటున్న ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలకు వేల రూపాయలు చెల్లించి ఇసుక కొనుగోలు చేసిన ప్రజలు ఇప్పుడు ఇసుకను తక్కువ ధరకు తీసుకుంటున్నారు. గతంలో టన్ను ఇసుక కొనాలంటే వేలాది రూపాయలు చెల్లించడంతో పాటు ఆ ఇసుకను తీసుకోవడానికి చాలా రోజుల పాటు వేచి చూశారు.

ఇప్పుడు టన్ను ఇసుక కేవలం రూ. 326కే వస్తుండటంతో ప్రజలు ఎగిరి గంతెస్తున్నారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం నుండి తక్కువ ధరకే ఇసుక ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఆ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష తెలిపారు. ట్రాక్టర్, లారీలు, టిప్పర్ వాహనాల యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను విక్రయించాలని, ప్రజల నుండి ఇసుకకు ఎక్కువ ధర వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా హెచ్చరించారు.

The coalition government made sand available at Rs 326 per tonne

బెళగల్ మండలంలోని కొత్తకోట, ముడుమాల, కే సింగవరం ప్రాంతాల్లో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేశామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. లోడింగ్, రాయల్టీ, జీఎస్టీతో పాటు ఇతర చార్జీలు అన్నిటితో కలిపి టన్ను ఇసుక వినియోగదారులకు రూ 326 కే చెల్లించేలా కమిటీ నిర్ణయించిందని కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. ఇసుక రవాణాకు సంబంధించి ట్రాక్టర్లో 4. 5 టన్నులు, ఆఱు చక్రాల లారీలలో 10 టన్నులు, 10 టైర్ల లారీలలొ 18 టన్నులు, 16 టైర్ల లారీలలో ఇసుక తరలించడానికి అనుమతి ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పలు జిల్లాల్లో సచివాలయాల్లో రూడా ఇసుక బుకింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద టన్ను ఇసుక రూ. 326 రూపాయలకే కొనగోలు చెయ్యడానికి అవకాశం రావడంతో భవనాలు, ఇండ్లు, పలు కట్టడాలు నిర్మిస్తున్న కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+