నేను రోజా మనిషి అంటూ హల్ చల్, మంత్రి నారా లోకేష్ ఎర్ర బుక్కులో ఆయన పేరు

నేను వైసీపీ లీడర్ రోజా మనిషిని, నాకు ఎదురు చెప్పినా, ఎదురు తిరిగినా ఇంతటితో మీ కథ క్లోజ్ అంటూ అనేకమందిని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఓ విద్యాశాఖ అధికారి పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎర్ర డైరీలోకి చేరిందని సమాచారం. మంత్రి నారా లోకేష్ ఎర్ర బుక్కులో పేరు ఉన్న ఆ విద్యాశాఖ అధికారికి ఇప్పుడు దడ మొదలైందని సమాచారం.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యా శాఖలో పనిచేస్తున్న అధికారి కాలేజీలో కంటే వైసీపీ నాయకుల ఇళ్లలోని ఎక్కువగా ఉండే వాడని వెలుగు చూసింది. అప్పటి తిరుపతి డీఈఓ శేఖర్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ లోని నాయకులు చుట్టూ తిరుగుతూ తనను రక్షించాలని వారిని పదేపదే వేడుకుంటున్నారని సమాచారం. వచ్చే ఏడాది విద్యాశాఖ అధికారి శేఖర్ పదవీ విరమణ చేయనున్నారు. ఇలాంటి సమయంలో వివాదాల్లో చిక్కుకున్న అప్పటి తిరుపతి డీఈఓశేఖర్ కూటమి ప్రభుత్వ విచారణ నుండి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

The coalition government ordered an inquiry against the Chittoor district education officer
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఈ విద్యాశాఖ అధికారి శేఖర్ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ వారి చుట్టూ తిరుగుతున్నారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన తర్వాత తిరుపతి జిల్లా మొదటి డీఈవోగా శేఖర్ ను నియమిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కొంతకాలనికే చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం డైట్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపల్ గా శేఖర్ పోస్టింగ్ తెచ్చుకున్నాడు.

అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెద్దల అండదండలతో శేఖర్ చెలరేగిపోయారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి జిల్లా, తరువాత శేఖర్ చిత్తూరు, తిరుపతి జిల్లాల విద్యాశాఖ అధికారులను బెదిరించడం మొదలుపెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రైవేట్ కళాశాల యాజమానులను బెదిరించి మీ అనుమతులు రద్దు చేస్తామని వారిని బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తాను ఆర్ కే. రోజా మనిషినని, తాను చెప్పిందే ఇక్కడ జరుగుతుందని, తనకు ఎదురు తిరిగితే మీ కథ క్లోజ్ అంటూ అప్పట్లో చాలా మందిని బెదిరించాడని తెలిసింది. అయితే ఈ విషయం రోజాకు కూడా తెలీకుండా శేఖర్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిసింది. ఈ విషయం రోజాకు తెలిసే లోపు వైసీపీ ప్రభుత్వం కూడా మారిపోయిందని విద్యాశాఖకు చెందిప ఓ అదికారి అంటున్నారు.

The coalition government ordered an inquiry against the Chittoor district education officer

తిరుపతిలో అనేక బ్రాంచ్ లు ఉన్న విద్యాసంస్థల అధినేతను కూడా రెండు సంవత్సరాల క్రితం ఇలాగే బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ విద్యా సంస్థలు అధినేతకు నారా లోకేష్ కి సన్నిహిత సంబంధాలు ఉండటంతో తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ వ్యవహారం అప్పట్లోనే నారా లోకేష్ వరకు తీసుకెళ్లారని తెలిసింది. అప్పుడే విద్యాశాఖ అధికారి శేఖర్ పేరు నోట్ చేసుకున్న నారా లోకేష్ ఇప్పుడు ఆయనపై విచారణకు ఆదేశించారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తనపై విచారణకు ఆదేశించారని తెలుసుకున్న విద్యాశాఖ అధికారి శేఖర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి వారి చుట్టూ తిరుగుతున్నారని తెలిసింది. అయితే వైసీపీ కండువా కప్పుకోవడం తప్పా ఆ పార్టీకి అన్ని సేవలు చేసిన శేఖర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసైడ్ అయ్యారు అని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+