TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం

కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వాతంత్ర దినోత్సవం సెలవు కావడం, శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ రావడం, పండుగ తరువాత శనివారం, ఆదివారం రావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

The consecration celebrations at the Tirumala Srivari Temple began in a traditional way

ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. గురువారం రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.\ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

The consecration celebrations at the Tirumala Srivari Temple began in a traditional way
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+