జగన్ సీరియస్, డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రభుత్వ స్కూల్ కు తాళం, మధ్యాహ్న భోజనంలో!

తిరుపతి/విజయవాడ: దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించడంలో తాము రాజీకాము అంటూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నది.

మధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా లేదా అంటూ విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రభుత్వ స్కూల్ లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఇంత వరకు అందలేని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ స్కూల్ కు తాళం వెయ్యడం కలకలం రేపింది.

Afternoon Meals

ఆంధ్రప్రదేశ్ లో పేదల కోసమే మా ప్రభుత్వం ఉందని చెప్పుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఊహించని సంఘటన ఎదురైయ్యింది. ఏదో ఓ ఎమ్మెల్యే నియోజక వర్గంలో ఇలాంటి సంఘటన జరిగింది అనుకుంటే అది ప్రత్యర్థ పార్టీలు రాజకీయం చేశారని, కావాలనే ప్రభుత్వాన్ని దెబ్బ తియ్యడానికి ఇలా చేశారని అనుకోవచ్చు.

అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సీఎం నారాయస్వామి సొంత నియోజక వర్గంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం వెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తిరుపతి-చిత్తూరు మధ్యలో ఉన్న జీడీ నెల్లూరు నియోజక వర్గంలోని కార్వేటి నగరం పంచాయితీ పరిధిలోని చాలకవానిగుంటలోని ఎస్టీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఉంది.

శుక్రవారం ఈ ప్రభుత్వ పాఠశాలకు తాళం వెయ్యడంతో టీచర్లతో పాటు పాఠశాల విద్యార్థులు స్కూల్ ఆవరణంలోనే కాలం గడిపారు. ఈ పాఠశాలలో ఏడాదిపొడవునా మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో భోజనం చేస్తున్న నిర్వహకులు భోజనం చెయ్యడం నిలిపివేశారు. ఎస్టీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలకు భోజనం చేసే బాధ్యతలను ఇతరులకు అప్పగించారు.

వేరే వ్యక్తులు ప్రస్తుతం ఆ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అయితే తాము కష్టపడి ఇంతకాలం వంట చేసి పెడితే ఇప్పుడు వేరే వ్యక్తులకు కాంట్రాక్టు అప్పగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పాత కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

YS Jagan Narayana Swamy

విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పాత కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లిస్తామని నచ్చ చెప్పడంతో ఆయన పాఠశాలకు తాళం తీశారని తెలిసింది. ఉప ముఖ్యమంత్రి సీఎం నారాయణస్వామి సొంత నియోజక వర్గంలో ఈ సంఘటన జరగడంతో ఈ మ్యాటర్ సీఎం జగన్ వరకు వెళ్లిందని తెలిసింది.

చిన్నచిన్న విషయాలకు ప్రభుత్వం పరువు తియ్యడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరు ?, అసలు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్ కు బిల్లులు ఎందుకు చెల్లించలేదు అని పూర్తి సమాచారం సేకరించాలని జగన్ ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. ఇదే విషయాన్ని అస్త్రంగా చేసుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు ఆ ఆరోపణలు తిప్పికొట్టడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+