వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Megastar Chiranjeevi: ఆ క్రెడిట్ తనది కాదంటూ వైఎస్ జగన్ రిప్లై: వలంటీర్ నుంచి కలెక్టర్ దాకా

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌నుఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 13 లక్షల 72 వేల మందికి పైగా ప్రజలకు వేయడం పట్ల జగన్ సర్కార్‌పై సర్వత్రా అభినందనలు అందాయి. రికార్డుస్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టి, దాన్ని విజయవంతం చేయడం పట్ల పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. ఒక్కరోజులో ఇన్ని లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం మామూలు విషయం కాదని, దాన్ని సాధ్యం చేసి చూపించిందని కితాబిచ్చారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రస్తావించారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుడా.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రభుత్వ పాలనా విధానానికి అద్దం పడుతోందని ప్రశసించారు. ఆ మరుసటి రోజే వైఎస్ జగన్ స్పందించారు. తన ప్రభుత్వాన్ని ప్రశంసించిన మెగాస్టార్‌కు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్లు చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అద్భుతంగా సాగిందని, విజయవంతమైందని పేర్కొన్నారు.

The Credit goes to the team effort AP CM YS Jagan given reply to the Megastar Chiranjeevi

గ్రామస్థాయిలో ఓ వలంటీర్ దగ్గరి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతి ఒక్కరి కృషితో ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని అన్నారు. దీన్ని విజయవంతం చేసిన ఘనత వార్డు/గ్రామ వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే డాక్టర్లు, ఇతర హెల్త్ వర్కర్లు, మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు దక్కుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన చిరంజీవి చేసిన ట్వీట్‌కు బదులు ఇచ్చారు. చిరంజీవి చేసిన ప్రశంసలు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ దక్కుతాయని వైఎస్ జగన్ అన్నారు.

English summary
Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy given reply to the Megastar Chiranjeevi, who appreciated the AP government. YS Jagan said that the Credit goes to the team effort by the Village/Ward Secretariats, Volunteers, ANMs, ASHA workers and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X