శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోండి, కొండ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం ?

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు, శారద పీఠానికి ఉన్న సంబంధాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తరువాత మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులను విమర్శించే వాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. ఇప్పుడు శారదా పీఠానికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ మొదలైయ్యింది.

2019కి ముందు శారదా పీఠానికి ఉన్న ఆస్తులు ఎన్ని ?, ఇప్పుడు అదే శారదా పీఠానికి ఉన్న ఆస్తులు ఎన్ని అని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఆరా తియ్యాలని, బినామీల పేరుతో ఉన్న ఆస్తులెంత అనే విషయం బయటపడుతుందని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. 2019 తరువాత శారదా పీఠం వైసీపీ క్యాంపు కార్యాలయంలా పని చేసిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూశారని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.

The demand was to take back the lands allocated by the then YCP government to Sarada Peetha

గతంలో వైసీపీ ప్రభుత్వం కొత్తవలసలోని శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివసానంద సరస్వతి డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు శారదా పీఠానికి కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీనివసానంద సరస్వతితో పాటు హిందూ సం్థల ప్రతినిధులు మనవి చేశారు.

శ్రీనివాసానంద నేతృత్వంలోని ప్రత్యక బృందం శారదా పీఠానికి కేటాయించిన కొండ ప్రాంతంలోని భూమిని మంగళవరం పరిశీలించింది. హిందూ సంస్థల ప్రతినిధులతో పాటు జనసేన పార్టీ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ కూడా ఈ బృందంంలో ఉన్నారు. కొండ ప్రాంతంలో భూమిని పరిశీలించిన అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు.

The demand was to take back the lands allocated by the then YCP government to Sarada Peetha

కొండలోని భూమిని చాలా చౌకగా శారదా పీఠానికి అప్పగించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించారని, అక్కడ వాణిజ్య కార్యకలాపాలకు, వ్యాపారాలకు అనుమతి కావాలని వాళ్లు కోరినా అందుకు వైసీపీ నాయకులు అంీకరించారని, పూర్తిగా వ్యాపార దోరణితో శారదా పీఠానికి చెందిన కొందరు చక్రం తిప్పడంతో అందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు.

శారదా పీఠం ఇప్పుడు వైసీపీ క్యాంపు కార్యాలయం అయ్యిందని, కొత్తవలసలో కొండ మీద ఎంతో విలువైన భూమిలో వేదపాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రజలను నమ్మించి వైసీపీ పెద్దల సహాయంతో విలువైన భూములు కొట్టేసి అక్కడ వ్యాపారం చెయ్యడానికి ప్రయత్నించారని, వేద పాఠశాల కోసం తీసుకున్న కొండ భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చెయ్యడానకి అనుమతి ఇవ్వాలని అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అర్జీ పెట్టకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడానికి పక్కా ప్లాన్ చేశారని శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. ఈ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఎన్డీఏ కూటమికి ప్రభుత్వానికి హిందూ సంస్థలు మనది చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+