Misala Geetha: టీడీపీ రెబల్ అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు..!
ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల గడువు ముగిసింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో గాజు గ్లాస్ ఉంది. ఎన్నికల అధికారులు కొంత మందికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీతాకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అయితే గీతాకు గాజు గ్లాసు గుర్తు కేటాయిండంపై టీడీపీ, జనసేన పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజు గ్లాసు గుర్తు కాకుండా ఇతర గుర్తులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
నిబంధనల ప్రకారమే గాజు గుర్తు కేటాయించిన్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మదనపల్లి స్వతంత్ర అభ్యర్థి సాజహాన్ కూడా ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. జనసేన పోటీలో లేని చోట ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని జనసేన ఎన్నికల సంఘాన్ని కోరింది. గతంలో గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడంతో జనసేన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

దీంతో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గుర్తు నుంచి తొలగించింది. అయితే జనసేన అభ్యర్థులు ఉన్న చోట గాజు గ్లాసు గుర్తు వారికే కేటాయించారు. జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. జగ్గయ్యపేట, మచిలీపట్నం, బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈ గుర్తు ఎన్ని నియోజకవర్గాల్లో కేటాయించారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications