విజయవాడలో నకిలి మందుల మాఫియా గుట్టురట్టు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

కృష్ణా జిల్లా: విజయవాడలో మరో నకిలీ దందా వెలుగు చూసింది. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ మందుల మాఫియా గుట్టురట్టయింది. ఈ డూప్లికేట్ మెడిసిన్స్ రాకెట్ కు సంబంధించి 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి నకిలీ మందుల తయారీకి వినియోగించే యంత్రసామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ కేంద్రంగా ఈ నకిలీ మందుల తయారీ రాకెట్ కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనేక ప్రముఖ కంపెనీల పేరుతో ఈ డూప్లికేట్ మందులను ఆంధ్రప్రదేశ్ కి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

The fake pharmacy mafia in vijayawada

తమ కంపెనీ పేరుతో నకిలీ మందులు చెలామణి అవుతున్నట్లు జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారుల తనిఖీలు చేపట్టడంతో ఈ నకిలీ మందుల గుట్టు బైటపడింది. సాయి మెడికల్స్‌లో అల్ట్రా సెట్ నకిలీ మందులను అధికారులు గుర్తించారు. సన్‌ఫార్మా, పాంటాసిట్‌-డిఎస్‌ఆర్, పాంటాసిట్-40 పేరుతో ఈ నకిలీ మందులు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడయింది. నకిలీ మందుల తయారీ ముఠాను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసులను మంత్రి కామినేని శ్రీనివాసరావు అభినందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
vijayawada: The fake drugs pharma mafia is using the Uttarakhand area as a shelter to transport huge quantities of duplicate medicines to vijayawada, Guntur and other cities. It may be recalled the vijayawada police arrested a 8-member gang and seized machinery.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి