కడపలో జగన్ పట్టు నిలిచేనా, బిగ్ ట్విస్ట్ - కొత్త లెక్కలు..!!
ఏపీలో ఎన్నికల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో గెలుపును పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో పోరు ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ సోదరి షర్మిల ఎంపీగా బరిలో నిలిచారు. వైఎస్ కుటుంబంలో రెండు పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. కడపలో జగన్ పక్కా లెక్కతో ఉన్నారు. కానీ, స్థానికంగా మాత్రం జగన్ అంచనాలు ఫలిస్తాయా లేదా అనే చర్చ మొదలైంది.
మారుతున్న లెక్కలు
కడప జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. షర్మిల బరిలో నిలవడంతో రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది. తన అన్న జగన్ లక్ష్యంగా షర్మిల ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీగా బరిలో ఉన్నఅవినాశ్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. వివేకా హత్య కేసు గురించి షర్మిల, సునీత ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిలకు మద్దతుగా రాహుల్, రేవంత్ ప్రచారం కోసం కడపకు వస్తున్నారు. కడపలో 2019 తరహాలోనే పది స్థానాల్లోనూ విజయం సాధించాలని జగన్ లక్ష్యంగా ఫిక్స్ అయ్యారు. పులివెందులలో జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అటు షర్మిల తనకు ఎంపీగా పులివెందులలోనే అధికంగా మెజార్టీ సాధించాలని లెక్కలు వేస్తున్నారు.

జగన్ అంచనాలు
తన అన్న జగన్, తాను పోటీలో ఉండటంతో ఎమ్మెల్యేగా జగన్..ఎంపీగా తనకు మద్దతు పులివెందులలో ఉంటుందని షర్మిల భావిస్తున్నారు. అక్కడే జగన్ తన వ్యూహం మార్చారు. పులివెందులలో నామినేషన్ సమయంలో పరోక్షంగా షర్మిలతో గ్యాప్ అంశంతో పాటుగా వివేకా హత్య కేసు పైనా తన వైఖరి స్పష్టం చేసారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ జగన్ తన సోదరి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల పోటీ చేయటం కంటే డిపాజిట్లు కోల్పోతుందనేది తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. కడపలో పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరులో జగన్ ప్రచారం చేసారు. షర్మిల సెంటిమెంట్ రాజకీయంతో వైసిపిపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఈమెకు మద్దతుగా వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.

మెజార్టీ దక్కేదెవరికి
టిడిపి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డికు మద్దతుగా ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించారు. లోకేష్ ఒకటి, రెండు రోజుల్లో రానున్నారు. భూపేష్‌రెడ్డికి మద్దతుగా చిన్నాన్న మాజీమంత్రి సి.ఆదినారాయణరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ పోటీలో ఉన్నా..స్థానికంగా జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. అవినాశ్ హ్యాట్రిక్ విజయం ఇప్పుడు జగన్ కు వ్యక్తిగత ప్రతిష్ఠగా మారుతోంది. అటు షర్మిల ప్రతీ ప్రచార సభలోనూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావటంతో పాటుగా.. కడప జిల్లాలో జగన్ అన్ని సీట్లు సాధించటం.. కడప ఎంపీ స్థానంలో మెజార్టీ దక్కించుకోవటం పైన ఫోకస్ చేసారు. దీంతో..అసలు కడప ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications