CM Jagan: జగన్ పై దాడి కేసు విచారణకు సిట్ ఏర్పాటు..
సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఏస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని సీరియస్ తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై శనివారం సాయంత్రం దాడి జరిగింది. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నట్లు తెలిసింది.

జగన్ పై దాడికి సంబంధించి ఈసీ ఇప్పటికే పోలీసులను నివేదిక కోరింది. జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ సమీపంలోని స్కూలు పైన నుంచి దాడి చేసినట్లు అంచనా వేస్తున్నారు. జగన్ ప్రచారానికి సంబంధించి భద్రత అధికారులు పలు సూచనలు చేశారు. యాత్ర చేస్తున్నప్పుడు జమాలలు, క్రేన్ ల ద్వారా అభినందనలు తీసుకొవద్దని సూచించారు. ఇక దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది.
మరోవైపు ఇదంతా వైసీపీ ఆడుతున్న నాటకమని టీడీపీ ఆరోపిస్తోంది. చిన్న గాయానికి 18మంది డాక్టర్లతో చికిత్స అవసరమా అని ఎంపీ రఘురామకృష్ణమరాజు అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి పెద్ద సర్జరీలకే 5, 6మంది డాక్ట్రర్లు ఉంటారని, అలాంటిది చిన్న గాయానికి అంత మంది డాక్టర్లు ఏంటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications