మూడు జిల్లాల ప్రజల జీవితాలను టార్గెట్ చేస్తారా, నీటిలో మొత్తం ఫినిష్ చేస్తాం
ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను డీకొట్టిన పడవలను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడిన బోట్లను అక్కడి నుండి బుధవారం సాయంత్రం లోపు తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ, ప్రజల భద్రత దృష్ట్యా నీటిలోనే ఆ మూడు పడవలను కత్తిరించి వాటిని అక్కడ నుండి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అందుకోసం విశాఖపట్నం నుండి 120 టన్నుల సామర్థ్యం గల ఎయిర్ బెలూన్స్ ను ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తెప్పిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. పడవల వెలికితీతకు బేకం సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి అని మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు.

సుమారు 40 నుండి 50 టన్నుల బరువు ఉన్న మూడు పడవలను ఒక దానికి ఒకటి కావాలనే కట్టి పెట్టి వాటిని ప్రకాశం బ్యారేజీలో వదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సుమారు 120 టన్నుల బరువు ఉన్న మూడు బోట్లను ఒకదానికి ఒకటి కట్టేసి వాటిని నీటిలో వదిలేయడం చాలా దారుణం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నాయకులపై మండిపడ్డారు.
ఈ మూడు పడవలు కౌంటర్ ఎడిషన్ కాకుండా కట్టడాలను డీకొట్టి ఉంటే మూడు జిల్లాలలోని ప్రజలకు తీవ్ర నష్టం జరిగి ఉండేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ బోట్లకు లంగర్లు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేయడం వెనక కుట్రకోణం ఉందని, ప్రకాశం బ్యారేజీ లో పడవలను వదిలిన వారిని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆ పడవలు వదిలిన వారిని హెచ్చరించారు.
ప్రకాశం బ్యారేజీలో పడవలు కావాలని వదిలేసిన కేసులో రామ్మోహన్, శేషాద్రి అనే ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఆ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు అరెస్టు అయిన ఇద్దరు నిందితులు చాలా సన్నిహితులు అని ఇప్పటికే పోలీసులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు వదిలిన రామ్మోహన్, ఉషాధ్రిలకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు లాగాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.












Click it and Unblock the Notifications