అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కల్యాణ్ కు సాయం చేసేది ఎవరు?

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ ముక్త ఏపీ కోసం అవసరమైతే పొత్తులకు కూడా సిద్ధమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని నిలదీస్తున్నారు. దూకుడుగా వెళుతున్న జనసేనానికి కూడా ఏదో ఒకవైపు నుంచి సాయం అవసరమవుతుంది.

కుటుంబం నుంచి మద్దతు అవసరం

కుటుంబం నుంచి మద్దతు అవసరం


అవసరమయ్యే సాయం ఆర్థికంగా కావచ్చు.. నైతికంగా కావచ్చు.. ఏ రూపంలోనైనా కావచ్చు. రానున్న ఎన్నికల్లో జనసేనకు సాయం చేయడానికి ఎవరున్నారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలుగుదేశం, బీజేపీ సాయం చేసినా ఆయా పార్టీలు వారి వారి స్వలాభం చూసుకుంటాయి. భారతీయ జనతాపార్టీ అయితే జనసేనను అడ్డంపెట్టుకొని రానున్న ఎన్నికలకు బలోపేతం కావాలని ప్రణాళికలు రచించుకుంటోంది. అధికార పార్టీపై దూకుడైన రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ కు ఎవరో ఒకరు అండగా నిలబడాల్సిన అవసరం కనపడుతోంది. వైసీపీ నుంచి ఎదురయ్యే ప్రతివ్యూహాలను తట్టుకోవడానికి, పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనకు కుటుంబం నుంచి మద్దతు రావల్సిన తరుణం ఆసన్నమైంది.

నాగబాబు ఒక్కరే కనపడుతున్నారు..

నాగబాబు ఒక్కరే కనపడుతున్నారు..


ప్రస్తుతం పవన్ కు నాగబాబు ఒక్కరే మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా ప్రకటనలకే పరిమితమవుతున్నారుకానీ నేరుగా బరిలోకి వచ్చి మద్దతు ప్రకటించినవారే లేరు. చిరంజీవి కూడా తాజాగా తన తమ్ముడు పవన్ ను ఉన్నతస్థానంలో చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. సొంత తమ్ముడు కాబట్టి చిరంజీవికి ఆ మాత్రం ప్రేమ, వాత్సల్యం ఉంటాయి.

ప్రకటనలకే పరిమితమవుతారా?

ప్రకటనలకే పరిమితమవుతారా?


అయితే వీటిని వ్యక్తపరిచే తీరునుబట్టి జనసేన బలోపేతమవ్వాలా? ఇలాగే ఉండాలా? అనేది ఆధారపడివుంటుంది. కుటుంబ సభ్యులంతా మాటలకే పరిమితం కాకుండా ఎన్నికలకు కనీసం సంవత్సరం ముందునుంచే ఒకరో.. ఇద్దరో బయటకు వచ్చి మద్దతివ్వాల్సి ఉండటమేకాదు అనుకూలంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి వారంతా ప్రకటనలకే పరిమితమవుతారా? ప్రచారానికి వస్తారా? అనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.

English summary
The help needed may be financial.. moral.. in any form.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X