వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పై సీఐడీ కేసు - ఆరు వారాలు స్టే : అమరావతి భూముల వ్యవహారం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో స్టే పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో నాటి సీఎం చంద్రబాబుతో సహా.. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పైన సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుతో సహా నారాయణ పై న ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

చంద్రబాబు - నారాయణకు నోటీసులు

చంద్రబాబు - నారాయణకు నోటీసులు

ఏపీ సీఐడీ అధికారులు 2021 మార్చిలో కేసులు నమోదు చేయటం తో పాటుగా హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు తో సహా నారాయణకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసుల పైన వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. వాటిపై గతేడాది మార్చి 19న విచారణ జరిపిన హైకోర్టు... సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తిరిగి ఈ కేసులు విచారణకు వచ్చాయి. దీంతో..మరో ఆరు నెలల పాటు నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు విచారణకు సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో ఆరు వారాలు పొడిగించింది.

గతంలో ఇచ్చిన స్టే పొడిగింపు

గతంలో ఇచ్చిన స్టే పొడిగింపు

విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌. మానవేంద్రనాథ్‌రాయ్‌ ఆదేశాలిచ్చారు. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు.

Recommended Video

2021 Year Ender: Major Political Events In 2021 | 2021 Politics Recall | Oneindia Telugu
అమరావతిలో భూ అక్రమాలు జరిగాయంటూ

అమరావతిలో భూ అక్రమాలు జరిగాయంటూ

ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనేది వైసీపీ ముఖ్యుల ఆరోపణ. అమరావతి భూముల వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల కమిటీతో పాటుగా అనేక రకాల విచారణలు నిర్వహించింది. కోర్టుల్లోనూ ఈ పరిణామాల పైన కేసులు కొనసాగాయి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపించింది. చంద్రబాబు - లోకేష్ బినామీలతో సహా పలువురు మంత్రులు సైతం ఇందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ అసెంబ్లీలో వారి పేర్లను ప్రభుత్వ ప్రస్తావించింది. ఇక, మూడు రాజధానుల వ్యవహారంతో ా అంశం కొత్త టర్న్ తీసుకుంది.

English summary
The High Court has extended the stay in the cases registered by the CID against TDP Chief Chandrababu and Narayana in Amarvati land cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X