అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాపిటల్ వార్ .. కేంద్రం ఎంట్రీ పక్కా అంటున్న బీజేపీ ఎంపీ ... అదెప్పుడు అంటున్న అమరావతి ప్రజలు !!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు పోరాటం సాగిస్తున్నాయి. కానీ జగన్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి పరిపాలనా వికేంరీకరణకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే విశాఖలో మిలీనియం టవర్స్ నిర్మాణానికి నిధులు విడుదల చేసిన జగన్ కర్నూలుకు న్యాయ రాజధానిగా పని చెయ్యటానికి కావాల్సిన ఆఫీసులను తరలించే పనిలో ఉన్నారు. ఇంతా జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ మాత్రం జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అసలు కేంద్రం స్టాండ్ ఏంటో చెప్పాలని అమరావతి ప్రజలు కోరుతున్నారు.

Recommended Video

AP 3 Capitals : Is Visakhapatanam Safe As Executive Capital ? Detailed Report

అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు

ఏపీ రాజధాని రగడపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? లేదా ? అనుమానం

ఏపీ రాజధాని రగడపై కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? లేదా ? అనుమానం

ఒకపక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలు రాజధానిగా అమరావతికే మద్దతు ఇస్తూ రాజధాని రైతులకు అండగా పోరాటం చెయ్యాలని భావిస్తున్నారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల వైఖరి మాత్రం రాజధాని విషయంలో ఇప్పటికీ తేటతెల్లం కావట్లేదు. అసలు జోక్యం చేసుకుంటుందా ?లేదా అసలే పట్టించుకోదా ? అన్న క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటివరకు రాజధాని కోసం ఇంత రగడ జరుగుతున్నా నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పిన దాఖలాలు లేవు.

 కొనసాగుతున్న బీజేపీ ఎంపీల భిన్న వాదన

కొనసాగుతున్న బీజేపీ ఎంపీల భిన్న వాదన

ఇక ఏపీలో ఉన్న బీజేపీ ఎంపీలు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఒకరు రాజధాని ఏర్పాటు, మార్పు అన్నీ రాష్ట్రం పరిధిలోవే అని తేల్చి చెప్తుంటే, మరొక ఎంపీ రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో రంగంలోకి దిగుతుంది అని చెప్పటం గమనార్హం . బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అంతే స్ట్రాంగ్ గా సుజనా చౌదరి రాజధాని అంశంపై కేంద్రం కచ్చితంగా రంగంలోకి దిగుతుంది అని చెప్తున్నారు.

సరైన సమయంలో కేంద్రం రంగంలోకి దిగుతుందన్న సుజనా

సరైన సమయంలో కేంద్రం రంగంలోకి దిగుతుందన్న సుజనా


ఇక అంతే కాదు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు . సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అవుతుందని ఢిల్లీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ముందుకెళ్తామన్నారు. అభివృద్ధి పేరుతో కాలయాపన తప్ప సీఎం జగన్ చేసేదేమీ లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పించారు. రాజధాని మార్పుపై వేసిన కమిటీలన్నీ.. నెగిటివ్‌ కమిటీలేనని అమరావతిపై సీఎం జగన్ పాజిటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ సుజనా చౌదరి సూచించారు.

ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్న అమరావతి ప్రజలు

ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్న అమరావతి ప్రజలు


ఇక రాజధాని అమరావతికి మద్దతుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు చెప్పిన మాటలే చెప్పటం మినహాయించి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు శాశానమండలిలో ఆమోదం పొందకున్నా, మండలి రద్దు చేసి కేంద్రానికి ఆమోదం కోసం పంపినా .. మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఇప్పటివరకు ఒక్క ప్రకటన చెయ్యకపోవటం గమనార్హం . కేంద్రం ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే కష్టం అన్న భావన అమరావతి రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఇకనైనా ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. తమకు న్యాయం చెయ్యమని విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Opposition parties are fighting to keep Amaravathi as the AP capital. But Jagan is committed to the decisiveness of the three capitals and embraces administrative decentralization. Jagan, who has already released the funds for the construction of the Millennium Towers in Visakha, is in the process of moving the offices needed to serve as the legal capital of Kurnool. All this while the BJP at the Center did not intervene. The people of Amaravati want the center to be a stand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X