మా నీతి నిజాయితీ చూసి ఓట్లు వేశారు, వైసీపీ, టీడీపీ నాయకులు ధీమాతో ప్రజలు షాక్!
ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో ఎన్నికల్లో పోటీ చేసి కొందరు నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది. ఎందుకంటే ఇంతకాలం మనం ఏం చేశాము, ప్రజలు మనకు ఎందుకు ఓటు వేస్తారు ? అని నాయకులకు ముందే తెలిసిపోయింది కాబట్టి కొంత మంది నాయకులు వాళ్ల గెలుపు విషయంలో ఓ అంచనాకు వచ్చారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. గతంలో కంటే ఈసారి భారీగా పోలింగ్ జరిగింది. ఎక్కువ శాతం పోలింగ్ జరగడంతో మాకు అనుకూలంగా ప్రజలు ఓట్లు వేశారని అధికార పార్టీ వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము అంటే ఏమనుకున్నారు ?, మా నీతి, నిజాయితీ చూసి ప్రజలు ఓట్లు వేశారని వైసీపీ నాయకులు అంటున్నారు.

వైసీపీ పాలనపై విరక్తితో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి. మాకు అనుకూలంగా ఓట్లు వేశారని కూటమి నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లు మాత్రం వాళ్లు ఎవరికి ఓటు వేశారు ?, ఎందుకు ఆ పార్టీకి ఓటు వెయ్యాల్సి వచ్చింది ? అంటూ ఏమాత్రం మ్యాటర్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
పోలింగ్ పూర్తి అయ్యి రెండు రోజాలు దాటిపోయినా ప్రజల నాడి తెలుసుకోలేక రాజకీయ నాయకులు నానా తిప్పులు పడుతున్నారు. తమకు అనుకూలంగా ఉంటున్న కార్యకర్తలను సామాన్య ప్రజల దగ్గరకు పంపించి మీరు ఎవరికి ఓటు వేశారు ?, ఎందుకు ఆ పార్టీకి ఓటు వెయ్యాల్సి వచ్చింది ? అని ఆరా తియ్యడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుందని తెలిసింది.
చిల్లర రాజకీయాలు చేసే చోటా నాయకుల గురించి మేము పట్టించుకోలేదని ఓటర్లు అంటున్నారు. అయితే ఓటరు నాడి తెలుసుకోవాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదని తెలిసింది. ప్రజలు నాడి బయటకు రాకపోవడంతో చాలా నియోజక వర్గాల్లో వైసీపీ, టీడీపీ నాయకులు గెలుపు విషయంలో అంచనాలు వెయ్యలేకపోతున్నారని తెలిసింది. మొత్తం మీద పలు నియోజక వర్గాల్లో టీడీపీ, వైసీపీ నాయకుల అంచనాలు తారుమారు అవుతున్నాయని తెలిసింది.












Click it and Unblock the Notifications