ఒక్కటైన టీడీపీ, వైసీపీ లీడర్స్, చెరువు మొత్తం స్వాహా, చోధ్యం చూస్తున్న అధికారులు
ఐదు సంవత్సరాల పాటు 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని జగన్ చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కాదు. చివరికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైన విషయం కూడా తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడంలో జరిగిపోయింది. అయితే ఓ ప్రాంతంలో బద్ధ శత్రువులుగా ఉన్న వైసీపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక్కటి కావడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగుదేశం, వైసీపీ నాయకులు ఒక్కటి కావడంతో ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సూళ్లూరుపేటకు సమీపంలోని ఐదు కిలోమీటర్ల దూరంలో ఇరువూరు చెరువు ఉంది. ఈ చెరువులో గ్రావెల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ చెరువులోని మట్టిని తవ్వేసి విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు ఎదురు చెప్పలేక టీడీపీ నాయకులు రెండు సంవత్సరాలు సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మరిన తర్వాత అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
ఇరువూరు చెరువులో మట్టిని తవ్వి విక్రయించడానికి టీడీపీ వైసీపీ నాయకులు ఒక్కటి అయిపోవడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఈ చెరువులో వైసీపీ నాయకులు భారీ ఎత్తున మట్టిని తవ్వి విక్రయించారని రెండు సంవత్సరాల నుండి టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం ఓ పారిశ్రామికవేత్త అతని సొంత భూమిని చదును చేయడడం కోసం ఈ చెరువులో మట్టిని తవ్వాలని ప్లాన్ చేశారు.
కొన్ని రోజుల క్రితం ఓ రాత్రి ఆ పారిశ్రామికవ్తేత టీడీపీ, వైసీపీ నాయకులను పిలిపించుకుని గ్రాండ్ గా పార్టీ ఇచ్చారని సమాచారం ఆ పార్టీలోనే టీడీపీ, వైసీపీ నాయకులు ఆ చెరువులోని మట్టిని తీసి ఆ పారిశ్రామికవేత్త భూమిని చదును చేయడానికి ఓ అంగీకారినికి వచ్చారని సమాచారం. అందుకోసం టీడీపీ, వైసీపీ నాయకులు ఆ పారిశ్రామికవేత్తతో లక్షల రూపాయలు డీల్ మాట్లాడుకున్నారని వెలుగు చూసింది. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ కార్యకర్తలు చెరువులో మట్టిని తీయడానికి వ్యతిరేకించారని సమాచారం.

తాను విజయవాడలో ఉన్నానని, వీఆర్ఓను పంపించి ఇరువూరు చెరువులోని మట్టిని తరలించకుండా అడ్డుకుంటామని జనవనరుల శాఖ డీఈ శ్రీధర్ స్థానిక మీడియాకు చెప్పారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దారు కూడా చెరువులోని మటన్ తీయకుండా అడ్డుకుంటామని అంటున్నారు. మొత్తం మీద సూళ్లూరుపేటకు చెందిన వైసీపీ, టీడీపీకి చెందిన నాయకులు ఓ పారిశ్రామికవేత్త కోసం ఒక్కటి కావడం తీవ్ర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications