రోజా మీద సీఐడీకి ఫిర్యాదు, ఆడుకుంటా రూ. 100 కోట్లు మింగేశారు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కూడా !
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నగిరి మాజీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్ కే రోజా అలియాస్ రోజా సెల్వమణి మీద సీఐడీకి ఫిర్యాదు చెయ్యడంతో వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. రోజా మంత్రిగా పని చేసిన సమయంలో దాదాపు రూ. 100 కోట్ల గోల్ మాల్ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని సీఐడీకి మనవి చేశారు. రోజా మీద సీఐడీకి ఫిర్యాదు చెయ్యడంతో నగిరిలోని ఆమె వ్యతిరేక వర్గం ఫుల్ హ్యాపీగాఉంది.
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్ కే రోజా క్రీడల శాఖా మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో ఆంధ్రప్రదేశ్ శాప్ ఛైర్మన్ గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి పని చేశారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పలు క్రీడల పోటీలు జరిగాయి.
ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్ క్రీడల పోటీలు సుమారు రూ. 100 కోట్ల అక్రమాలు జరిగాయని, వాటిపైన విచారణ జరిపించాలని అత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్ తదితరులు ఆంధ్రప్రదేశ్ సీఐడీ డీజేపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆర్డీ ప్రసాద్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కలిసి రూ 100 కోట్లకుపై అవకతవకలకు పాల్పడ్డారని, ఈ విషయంపై వీరి ఇద్దరితో పాటు అన్ని జిల్లాల డీఎస్ డీవోలపై విచారణ జరిపించాలని సీఐడీ విభాగం డీజీపీకి మనవి చేశామని ఆర్డీ ప్రసాద్ మీడియాకు చెప్పారు. అన్ని జిల్లాల క్రీడాశాఖ అధికారులను విచారణ చేసి వివరాలు సేకరించాలని సీఐడీకి మనవి చేశామని ఆర్డీ ప్రసాద్ అన్నారు.

ఐదు సంవత్సరాల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఆ విషయంలో విచారణ జరిపించాలని సీఐడీకి మనవి చేశామని ఆర్డీ ప్రసాద్ అన్నారు. క్రీడా కోటాలో ట్రిపుల్ ఐటీ, మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ జరిపించాలని సీఐడీకి మనవి చేశామని అన్నారు.
మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డితో పాటు క్రీడా శాఖ అధికారులను విచారణ చేస్తే రూ. 100 కోట్ల అవకతవకలు బయటకు వస్తాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐడీకి మనవి చేశామని ఆర్డీ ప్రసాద్ మీడియాకు చెప్పారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్ కే రోజా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications