అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని.. కొడుకునే చంపించింది:ఆ టీచర్ మాకొద్దు
Recommended Video

నెల్లూరు:కూతురు భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకొని కన్నకొడుకునే దారుణంగా హత్య చేయించిన ఆ అంగన్ వాడీ టీచర్ తమకు వద్దంటూ గమళ్లపాలెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రం టీచర్ బొడుగు సీతారావమ్మ తమకు వద్దని గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె సొంత కొడుకునే చంపించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధికారులకు తమ వాదన వినిపించారు.

గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రం టీచర్ బొడుగు సీతారావమ్మ ను పోలీసులు హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారని వార్తలు రావడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో సునీలత సోమవారం ఈ విషయమై విచారణ చేసేందుకు గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు సీడీపీవో ఎదుట నిరసన తెలిపారు.
ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రానికి టీచర్‌గా ఉన్న సీతారావమ్మను వెంటనే తొలగించి మరొకరిని నియమించాలని కోరారు. అవసరమైతే ఈ విషయాన్ని కలెక్టర్‌కు కూడా తాము విన్నవించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం సీడీపీవో మాట్లాడుతూ సునీలత మాట్లాడుతూ ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి పీడీకి, జేసీకి నివేదిక అందచేస్తానని వారికి హామీ ఇచ్చారు.
గమళ్లపాళెంకు చెందిన బొడుగు కార్తీక్ (25) జూలై 17వ తేదీన హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన కాల్వలో దొరికిన ఈ మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోవడంతో అనాథ శవంగా భావించి ఖననం చేసేశారు. అలా మూడు వారాలుగా మిస్టరీగానే ఉండిపోయిన ఈ హత్య కేసులో పోలీసులకు ఉన్నట్లుండి లభించిన కీలక సమాచారంతో మిస్టరీ వీడటం ఖాయం అయింది.
పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కార్తీక్ తల్లి తన పెద్ద కుమార్తె భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కుమారుడికి తెలిసి అతడు రోజూ మద్యం తాగొచ్చి తల్లిని తీవ్రంగా దుర్భాషలాడటంతో పాటు కొట్టేవాడు. దీంతో ఎలాగైనా కొడుకును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న అతడి తల్లి ఇదే విషయమై అల్లుడితో సంప్రదించి కొడుకు కార్తీక్ హత్యకు పథకం రచించింది. అందుకు కిరాయి హంతకులను మాట్లాడివారికి రూ. 5 లక్షలు సుపారి ముట్టచెప్పి కొడుకును చంపించినట్లు తెలుస్తోంది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications