Pithapuram: నామినేషన్ విత్ డ్రా చేసుకున్న గీత..!
ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతోన్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో జనసేన అధినేత గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గెలుపు కోసం సెలబ్రెటీలు, కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. శనివారం వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. ఇప్పటికే ఇక్కడ పవన్ ప్రచారం చేశారు. తాజాగా వైసీపీ వారు జనసేన పై పలు విమర్శలు చేశారు. పవన్ పిఠాపురంలో ఓడిపోతారనే భయంతో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేత వర్మని నమ్మలేక.. అలా అని వదులుకోలేక గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ పడరాని పాట్లు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా గ్రాఫ్ రోజురోజుకీ పెరిగిపోతుండటంత పవన్‌కి పెరిగిన ఓటమి భయం పట్టుకుందనన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పిఠాపురంలో గీత పేరు ఉన్న మహిళతో నామినేషన్ వేయించారని ఆరోపించారు. ఇద్దరి అఫిడవిట్‌ను ఒకే లాయర్ ఫిల్ చేయడంతో కుట్ర బయటపడినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అఫిడవిట్లకు సంబంధించి ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. రెండు అఫిడవిట్లను వెంకట రమణ రావు తయారు చేసినట్లు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అమలపురం పీకే ఫ్యాన్స్ అనే ట్విట్టర్ అకౌంట్ లో నామినేషన్ వెనక్కి తీసుకున్న వంగా గీత అంటూ పోస్ట్ చేశారు. వంగా గీతా జనసేన తరఫున పోటీ చేస్తారని కూడా రాసుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలా జిమ్మిక్కులు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్ని చేసినా వైసీపీదే విజయమని కుండ బద్దలు కొడుతున్నారు.












Click it and Unblock the Notifications