కుప్పంలో టీడీపీ-నెల్లూరులో జనసేన : వైసీపీతో పోటాపోటీగా- నామినేషన్లలోనే హోరా హోరీ..!!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. శుక్రవారం చివరి రోజు కావటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటుగా నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఈ సారి ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఇక, పల్నాడులోనూ రెండు పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధాన పార్టీలు
నామినేషన్ల దాఖలు నుంచి అధికార పార్టీకీ ధీటుగా పోటీలో నిలబడాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. ప్రధానంగా ఆయన కుప్పం పైన ఫోకస్ పెట్టారు. తమ అభ్యర్ధులను అడ్డుకుంటున్నాంటూ నేరుగా ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. అవససమైతే తానే ఎన్నికల సంఘం కార్యాలయానికి వస్తానని హెచ్చరించారు. ఇక, నామినేషన్లలో పొత్తులు..ఆశావాహుల ఒత్తిడి నడుమ ఆ ప్రక్రియ పూర్తి చేసారు. ఇక, పార్టీల పరంగా అభ్యర్ధులను ఖరారు చేసి..మిగిలిన వారితో ఉప సంహరణ కోసం బుజ్జగింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

నెల్లూరు కార్పోరేషన్ లో జనసేన 50 నామినేషన్లు
నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీలు.. 14 జెడ్పీటీసీ.. 176 ఎంపీటీసీ.. 69 సర్పంచ్..533 వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్ లో 54 డివిజన్లు ఉండగా.. 471 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 139 వైసీపీ నుంచి..155 టీడీపీ తరపున, 50 నామినేషన్లు జనసేన నుంచి దాఖలు చేసారు. ఇక, రాష్ట్రా వ్యాప్తంగా 274 మున్సిపల్ వార్డులకు అన్ని పార్టీల నుంచి 1,843 నామినేషన్లు వేసారు. ప్రత్యేకించి కుప్పం మున్సిపాల్టీలో 25 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి 89, టీడీపీ నుంచి 126 తో పాటుగా మొత్తం 240 నామినేషన్లు దాఖలయ్యాయి.

కుప్పంలో చంద్రబాబు ప్రత్యేక ఫోకస్
కార్పోరేషన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 12 డివిజన్లకు 96 నామినేషన్లు.. మున్సిపాల్టీల్లో 13 వార్డులకు 51 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. 69 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి కోసం 288 నామినేషన్లు దాఖలు కాగా .. 533 వార్డు స్థానాలకు 748 మంది నామినేషన్లు వేసారు. 176 ఎంపీటీసీ స్థానాలకు 592 మంది అభ్యర్ధులు...14 జెడ్పీటీసీలకు 33 మంది నామినేషన్లు దాఖలు చేసారు. అయితే, నెల్లూరు లో బీజేపీ - జనసేన అభ్యర్ధుల పొత్తు అంశం చివరి నిమిషం వరకు తేలలేదు. దీంతో...ముందుగా నామినేషన్లు వేసినట్లుగా తెలుస్తోంది.
Recommended Video

చంద్రబాబు ఇలాకాలో వైసీపీ జెండా ఎగిరేనా
ఉప సంహణ గడువు లోగా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరెక్కడ పోటీ చేయాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, కుప్పంలోనూ పోటీని సీరియస్ గా తీసుకున్న వైసీపీ..టీడీపీ నామినేషన్లను భారీగా దాఖలు చేసారు. కుప్పం లో ఎలాగైనా గెలవాలని వైసీపీ చూస్తుంటే.. వారికి అవకాశం దక్కకుండా స్వయంగా టీడీసీ అధినేత చంద్రబాబు అక్కడి ఎన్నిక నిర్వహణ తీరును...పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇక, సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న దాదాపుగా చివరి ఎన్నిక లు కావటంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications