ప్రభుత్వాన్ని నిలదీద్దాం - టీడీఎల్పీలో నిర్ణయం : అసెంబ్లీలో తొలి రోజునే..!!
ఈ రోజు నుంచి ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కీలక అంశాల్లో నిలదీయాలని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించింది. సమావేశాలకు తొలుత హాజరు కావాలా వద్దా అనే మీమాసం నుంచి సమావేశా లకు హాజరు కావాలని నిర్ణయించిన టీడీపీ సభ్యులు సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశమయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అసెంబ్లీకి చేరారు. మూడు సంవత్సరాలుగా టీడీపీ సభ్యులను అవమానాలకు గురి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకుడితో పాటు కుటుంబ సభ్యులను సైతం అవమానిస్తున్నారన్నారు. శాసనసభా గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంట గలుపుతున్నారన్నారు. కర్తవ్య బాధ్యతను నెరవేర్చడం కోసం టీడీపీ తరపున సభకు హాజరు అవుతున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మూడేళ్ళలో సభ సజావుగా నడిచింది లేదన్నారు. సభ గౌరవం పెంచేలా ప్రతిపక్ష పార్టీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేసారు. స్పీకర్ వైసీపీ సభ్యుడిగా కాకుండా హుందాగా వ్యవహరించాలి. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లమని అచ్చెన్న స్పష్టం చేసారు.

ఇక, సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగం మొదలైంది. ఆ వెంటనే టీడీపీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు ప్రారంభించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ స్లోగన్లు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేసారు. పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఆ తరువాత సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. లాబీల్లో మార్షల్స్ అడ్డుకోవటం పైన టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కాసేపట్లో జరిగే బీఏసీ సమావేశానికి టీడీపీ నేతలు హాజరై..తమ పార్టీ తరపున చర్చలకు ప్రతిపాదనలు అందించనున్నారు.
Recommended Video
అదే సమయంలో సమావేశాల నిర్వహణ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెబుతున్నారు. దీంతో..ఊహించిన విధంగానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు నుంచే హాట్ హాట్ గా మొదలయ్యాయి. ఇక, బీఏసీ సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనలు..టీడీపీ డిమాండ్ల పైన స్పందన ఏ రకంగా ఉంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications