ఎంతకు తెగించారు, ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు వదిలేశారు, వైసీపీ లీడర్స్ అందర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఉద్దేశంతోనే ప్రకాశం బ్యారేజీ గేట్లను డీకొట్టేలా భారీ బోట్లను నదిలో వదిలేశారని, దీని వెనక కుట్ర కోణం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 50 టన్నుల బరువు ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొడితే ఆ గేట్లు దెబ్బతింటాయని, తరువాత కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పక్కా ప్లాన్ చేసిన కొందరు వ్యక్తులు ఆ పడవలను ప్రకాశం బ్యారేజీలో వదిలేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసింది.
ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు సమీప బంధువు అయిన కొమటి రామ్మోహన్, అతని ముఖ్య అనుచరుడు ఉషాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుల రామ్మోహన్, ఉషాద్రిల ఫోన్ కాల్ డేటా, గూగుల్ టేక్ అవుట్ వివరాలను విజయవాడ పోలీసులు సేకరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టిన బోట్లలో మూడు బోట్లు ఉషాద్రివి అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశిల రఘురాం కు రామ్మోహన్ చాలా దగ్గర బంధువు అని పోలీసులు అన్నారు, రామ్మోహన్ కు ఉషాద్రి చాలా సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కూడా ఈ ఉషాద్రి చాలా సన్నిహితుడు అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ కు చెందిన అక్రమ ఇసుక వ్యాపారంలో ఉషాద్రి సహకరించేవాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నందిగం సురేష్ సుమారు 100 సొంత లారీలు, అద్దె లారీలలో అక్రమంగా ఇసుకను అమరావతికి తరలించాడని, రాత్రిపూట నందిగం సురేష్ లారీలకు ఉషాద్రి ఇసుక లోడ్ చేయించే వాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఉషాద్రి అతని మూడు భారీ బోట్లను కేవలం ప్లాస్టిక్ తాళ్లతో కట్టేశారని, బోట్లను లంగరు వేసి కట్టాలని చెప్పినా ఉషా ద్రి ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే మూడు నాలుగు రోజుల ముందుగానే ఈ బోట్లను గొల్లపూడి ప్రాంతం వైపు తెచ్చి నిలిపారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో ఉండే ఈ బోట్లను కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గొల్లపూడి రేవు సమీపంలోని స్మశానం దగ్గర తెచ్చి ప్లాస్టిక్ కవర్లతో కట్టేశారని, వాటికి లంగర్ కూడా వేయలేదని, కేవలం ప్లాస్టిక్ తాళ్లతోనే ఆ బోట్లను కట్టేశారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉషాద్రికి చెందిన బోట్లు ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టాయని వెలుగు చూడటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు డీకొట్టిన ఘటన వెనుక కుట్రకోణం ఉందని వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మొత్తం ఐదు కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications