ఆ పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి: వైయస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందన్నారు.

ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏలను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కోని నిర్వీర్యం చేసి.. ప్రజావసరాల కోసం అనే పేరుతో యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

The previous Jagan regime had to increase electricity charges Gottipati Ravikumar

గడిచిన ఐదేళ్లలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో జగన్ సర్కార్ ఎక్కడా పారదర్శకత ప్రదర్శించలేదని మంత్రి గొట్టిపాటి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లను క్విడ్ ప్రోకో విధానం ద్వారా జరిపి, వచ్చిన ప్రజల సొమ్ము అంతా తాడేపల్లి ప్యాలెస్ తరలించారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. కేవలం విద్యుత్ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతా కూడా రహస్యంగానే జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిలు నడిపించారన్నారు. వీరు అనుసరించిన విద్యుత్‌ విధానాల పాపమే నేడు ప్రజల మెడలకు సర్దుబాటు చార్జీల ద్వారా చుట్టుకుందని గొట్టిపాటి విమర్శించారు.

జగన్ మోహన్ రెడ్డి బరితెగింపు దోపిడి కారణంగా గడిచిన ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. అంతేగాకుండా జగన్ రెడ్డి చేసిన పాపాల కారణంగా ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి గాను మరో రూ.11,826.42 కోట్ల భారం పడుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ మొత్తాన్ని డిస్కంలు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని ఈఆర్సీని కోరినా సంబంధీకులు వాయిదా వేస్తూ వచ్చారని చెప్పారు.

చివరగా 2024 మార్చి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాల్సి వస్తే... ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాయిదా పర్వం కొనసాగినట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగిపోతూ కూడా తాను చేసిన దోపిడీని ప్రజల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీని కోరడం ప్రజలు గమనించాలని కోరారు.

గత ప్రభుత్వంలోనే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన మొత్తాన్ని కమిషన్ వాయిదా వేస్తూ అక్టోబర్ లో నిర్ణయం తీసుకుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ కారణంగా జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సి వస్తోందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచితన నిర్ణయాలతోనే ప్రజలపై విద్యుత్‌ సర్దుబాటు చార్జీల భారం పడిందని స్పష్టం చేశారు.

ఇది ఇలావుంటే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక సాక్షి తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. పాపాలన్ని జగన్ అండ్ కో చేసి.. చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాలకు పరాకాష్ట అయిన సాక్షి పత్రికను అడ్డంపెట్టుకుని తప్పుడు కథనాలను ప్రచురించడం మంచిది కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుమార్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+