Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ నడి బొడ్డున టీడీపీ Vs వైసీపీ - గేమ్ ఛేంజ్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రతీ సీటులో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని భావిస్తున్నారు. చర్చలు పూర్తయినా బీజేపీ నుంచి అధికారికంగా నిర్ణయం రాలేదు. ఇక, వైసీపీ - టీడీపీ అభ్యర్దుల పైన క్లారిటీ ఇస్తున్నారు. విజయవాడలో రెండు పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. రెండు పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

విజయవాడలో రాజకీయం ఆసక్తి పెంచుతోంది. 2019 ఎన్నికల్లో సిటీ పరిధిలోని మూడు స్థానాల్లో రెండు వైసీపీ గెలవగా, తూర్పు టీడీపీ అభ్యర్ది గెలుపొందారు. ఈ సారి టీడీపీ 2019లో పోటీ చేసిన అభ్యర్దులనే మరోసారి తూర్పు, సెంట్రల్ నియోజవర్గాల్లో ప్రకటించింది. సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్దిగా బోండా ఉమా మహేశ్వర రావు పేరు ఖరారైంది. వైసీపీ నుంచి గతంలో పశ్చిమ నుంచి గెలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును పోటీకి దించారు. సెంట్రల్ నుంచి కొద్ది రోజల క్రితం వంగవీటి రాధా పోటీ చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కానీ, తిరిగి ఇప్పుడు ఉమాకే సీటు కేటాయించటంతో ఇక్కడి సామాజిక సమీకరణాలు పోటీ పైన ఆసక్తి కర విశ్లేషణలు మొదలయ్యాయి.

The race for the Vijayawada Central constituency is heating up with TDP and YCP candidates campaign

2009లో జరిగిన ఎన్నికల్లో సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసిన మల్లాది విష్ణు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి బోండా ఉమ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది బోండా ఉమ పై వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన మల్లాది విష్ణు 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. దీంతో తిరిగి బోండా ఉమాకే తిరిగి సీటు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇక్కడ గెలుపు ఓటమలును స్థానిక సామాజిక వర్గాలే డిసైడ్ చేస్తాయి. టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. కానీ, స్థానికంగా ప్రభావితం చేసే కొన్ని వర్గాల ఓట్ల పైన వైసీపీ నమ్మకం పెట్టుకుంది. ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరటంతో టీడీపీ కి మద్దతుగా నిలిచే కొంత ఓట్ బ్యాంక్ వైసీపీ వైపు మళ్లుతుందనే అంచనాలు ఉన్నాయి.

కేశినేని నాని వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే విధంగా బీజేపీ ఇప్పుడు టీడీపీ, జనసేనతో కలిస్తే ఈ నియోజకవర్గంలో కొంత మేర ఓటింగ్ లెక్కలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలైంది. ఈ సీటును రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఈ లెక్కలతో విజయవాడ సెంట్రల్ లో గెలిచేదెవరనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+