Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు మళ్లింపు..
సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి చెప్పారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మూడో లైను నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి, గాంధీథాం రైళ్లను వయా విజయనగరం, రాయపూర్, నాగపూర్ మీదుగా మళ్లింపు మార్గంలో నడపనున్నట్లు ప్రకటించారు.
విశాఖ -న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805), న్యూఢిల్లీ -విశాఖ (20806) ఏపీ ఎక్స్‌ప్రెస్ లను దారి మళ్లీంచనున్నారు. సెప్టెంబర్ 14, 21 తేదీల్లో విశాఖ -గాంధీథాం ఎక్స్‌ప్రెస్ (20803), సెప్టెంబర్ 24న గాంధీథాం- విశాఖ ఎక్స్‌ప్రెస్ (20804) నడుస్తుంది. సెప్టెంబర్ 22, 25 తేదీల్లో విశాఖ- నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ (12803) ను దారి మళ్లించనున్నారు. సెప్టెంబర్ 20, 24 తేదీల్లో నిజాముద్దీన్ -విశాఖ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ (12804) రైళ్లు వయా విజయనగరం, నాగపూర్ మీదుగా రాకపోకలు కొనసాగుతాయి.

అదేవిధంగా పూరి- వోకా ఎక్స్‌ప్రెస్ (20819) సెప్టెంబర్ 24న వయా విజయనగరం, నాగపూర్ మీదుగా నడవనున్నాయి. ఇటు సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 20 దూరప్రాంతాల రైళ్లతో పాటు హైదరాబాద్ లో నడిచే 16 ఎంఎంటీఎస్ రైళ్లను 11 తేదీ వరకు రద్దు చేశారు. కాజీపేట, డోర్నకల్, విజయవాడ, భద్రాచలం రోడ్ , సిర్పూర్టౌన్, బల్లార్షా, సికింద్రాబాద్, వరంగల్,హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు.
గరంలో వివిధ స్టేషన్ల మధ్య నడిచే 16 ఎంఎంఎటీఎస్రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. లింగంపల్లి- హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 4 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్నుమా, ఫలక్నుమా- లింగంపల్లి మధ్య 1 సర్వీసు, ఉందానగర్- లింగంపల్లి మధ్య, లింగంపల్లి- ఉందానగర్మధ్య 2 సర్వీసులు, లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 2 సర్వీసులను రద్దు చేశారు. 11 తేదీ నుంచి యథావిధిగా ఎంఎంటీఎస్ రైళ్లు నడవనున్నాయి.
కొన్ని రద్దీ మార్గల్లో ప్రయాణించే రైళ్లను కూడా రద్దు చేశారు. ఏపీలోని అనకాపల్లి- తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ పనుల కారణంగా ఈ నెల 3 నుంచి 10 తేదీల మధ్య పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications