రూ 2000 నోటు మార్చుకుంటున్నారా, ఎలా - ఆర్బీఐ ఏం చెబుతోంది..!!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రూ. 2000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు రూ.2,000 నోట్ల మార్పిడికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఖాతాదారులు రూ 2000 నోటు మార్పుకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. బ్యాంకు ఖాతా లేని వారు ఈ నగదును ఎలా మార్చుకోవాలో ఆర్బీఐ స్పష్టం చేసింది.

రూ 2000 నోట్లు మార్పు కోసం : రూ 2000 నోట్లు మార్పు కోసం కసరత్తు ప్రారంభమైంది. మంగళవారం నుంచి బ్యాంకుల్లో వీటి మార్పుకు ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి వ్యాపారుల వద్దకు పెద్ద మొత్తంలో 2000 నోట్లు వస్తున్నాయి. వీటిని కొందరు నిరాకరిస్తున్నారు. సాధారణ వ్యక్తుల దగ్గర తక్కువ మొత్తంలోనే రెండు వేల నోట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రెండు వేల నోట్ల ముద్రణను ఆర్బీై 2018-19 కాలంలోనే నిలిపివేసింది. మార్చి 31, 2023 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో రెండు వేల నోట్ల విలువ 10.8 శాతం మాత్రమేనని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకుల ఏటీఎంల్లోనే చాలా కాలం గా కేవలం 500, 200, 100 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

 rbi-

ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు : రెండు వేల నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రజలు తమ బ్యాంకు ఖాతాలలో రూ. 2000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఏదైనా బ్యాంకు బ్రాంచ్ లతో పాటుగా ఆర్బీఐ శాఖలలో ఇతర డినామినేషన్ నోట్లుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. రూ. 2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదు. అయితే ఆర్బీఐ సూచనలు, ఇతర చట్టపరమైన నిబంధనలకు లోబడి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మే 23, 2023 నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను ఏ బ్యాంకులో అయినా ఇతర డినామినేషన్ల నోట్లుగా మార్చుకోవచ్చు. అయితే రోజుకు రూ. 20,000 వరకు మాత్రమే మార్చుకోవడం వీలవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

కేవైసీ త‌ప్ప‌నిస‌రి : రూ 2000 నోటును తీసుకోవటానికి ఎవరూ నిరాకరించే అవకాశం లేదని ఆర్డీఐ పేర్కొంది. బ్యాంకులో ఖాతా లేకపోతే మార్చుకొనే అవకాశం ఉండదనే ప్రచారం పైనా ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. ఖాతా లేకపోయినా నిర్దేశించిన గుర్తింపు పత్రాలతో బ్యాంకు ఖాతా లేకపోయినా బ్యాంకుకు వెళ్లి నోటు మార్చుకోవచ్చని ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. నోట్ల మార్పిడి కోసం కస్టమర్‌లకు ఛార్జీ విధించ కూడదని నిర్దేశించింది. కానీ, రోజు వారి పరిమితి మాత్రం 20 వేలుగా నిర్దారించింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రెండు వేల నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వ్యక్తి గరిష్టంగా పది నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. ఖాతాకు కేవైసీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. కేవైసీ లేనిదే రూ.2,000 నోట్లు ఖాతాలో జమ కావని కూడా బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+