జగన్ అసెంబ్లీకి రానిది అందుకే.. ! అసలు కారణం చెప్పేసిన స్పీకర్..!

అసెంబ్లీ సమావేశాలకు రాకుండా దూరంగా ఉండిపోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఇవాళ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరోక్షంగా తీవ్ర విమర్శలకు దిగారు. అనపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన స్పీకర్.. జగన్ తీరుపై మండిపడ్డారు. అలాగే ఆయన అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో అసలు కారణం చెప్పేశారు. ఈ కారణం వల్లే జగన్ అసెంబ్లీకి రావడం లేదని అయ్యన్నపాత్రుడు తేల్చిచెప్పేశారు.

అనపర్తి నియోజకవర్గంలోని రామలింగేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న పూజలకు హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. అనంతరం వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. అప్పట్లో రాక్షస పాలన కొనసాగిందన్నారు. కొంతమంది దుర్మార్గులు, రాజకీయాలకు అర్ధం తెలియని వారు ప్రభువులు అయ్యారంటూ మండిపడ్డారు. గత పాలకుడికి అధికారం తెలుసు తప్ప పాలన తెలియదన్నారు. కాబట్టి మూర్ఖత్వంతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టారన్నారు.

The Reason Behind Jagan s Assembly Absence Revealed by Speaker Ayyannapatrudu

అప్పట్లో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారంటూ జగన్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారన్నారు. ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంటే వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. అనంతరం జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండిపోవడంపై స్పందించారు. జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, కాబట్టి సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం మాత్రమే ఆయనకు ఇస్తామన్నారు.

The Reason Behind Jagan s Assembly Absence Revealed by Speaker Ayyannapatrudu

జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, బయట మీడియా ముందు మాట్లాడటం కాదన్నారు. జగన్ తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొంటున్నారని, కానీ అసెంబ్లీకి రావడం లేదని స్పీకర్ విమర్శించారు. చివరిగా జగన్ అసెంబ్లీకి వచ్చి తన ముందు అధ్యక్షా అని సంబోధిస్తూ మాట్లాడటం ఇష్టం లేకే సభకు రావడం లేదని స్పీకర్ తేల్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+