బిగ్ ట్విస్ట్, ఎగ్జిట్ పోల్స్ నిజం కాదా - వార్ రూమ్స్ ఫైనల్ రిపోర్ట్స్..!!
తెలంగాణలో పాలిటికల్ ట్విస్టులు కొనసాగుతున్నాయి. పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఇదే ఇప్పుడు అసలు ఉత్కంఠకు కారణమవుతోంది. కేటీఆర్ ఈ ఎగ్జిట్ పోల్స్ ను వ్యతిరేకించారు. కాంగ్రెస్ గెలుపు పై ధీమాతో ఉన్నా పోలింగ్ సరళిపై తుది అధ్యయనం చేస్తోంది. బీఆర్ఎస్ వార్ రూమ్ లెక్కలు వేరుగా ఉన్నాయి.తాజా లెక్కలతో ఎగ్జిట్ పోల్స్ నిజం కావా. ఫలితం మారుతుందా. అసలు ఏం జరుగుతోంది. ఏం తేల్చారు.
మారుతున్న లెక్కలు : తెలంగాణలో పోలింగ్ తరువాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం ఖాయమని తేల్చాయి. కానీ, మరి కొన్ని హంగ్.. మరి కొన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. మంత్రి కేటీఆర్ ఈ ఎగ్జిట్ పోల్స్ ను తిరస్కరించారు. తాము 70 సీట్లకు పైగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసారు. తుది పోలింగ్ శాతం వచ్చిన తరువాత ఫలితం పై క్లారిటీ వస్తుందన్నారు.

కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ కు 25 సీట్లు వస్తాయని చెబుతోంది. ఈ పోరులో బీజేపీ అందరి అంచనాలను దాటుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. చివరగా పోలింగ్ శాతం 70.66 గా ఎన్నికల సంఘం తేల్చింది. 2018 లో పోలింగ్ శాతం 73.74 శాతంగా ఉంది. ఇదే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స అంచనాల పైన సందేహాలకు..తుది ఫలితాలపైన ఉత్కంఠకు కారణమవుతోంది.
కొత్త విశ్లేషణలు మొదలు : పోలింగ్ సరళి పైన కాంగ్రెస్..బీఆర్ఎస్ వార్ రూమ్స్ లో విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తమకు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఏకపక్షంగా పోలింగ్ జరిగిందనే అంచనాకు వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ తో గట్టి పోటీ ఎదుర్కొన్నట్లు తేల్చారు. ఇటు బీఆర్ఎస్ లోనూ పోలింగ్ సరళి పైన అర్ద్రరాత్రి వరకు విశ్లేషణలు జరిగాయి. తెలంగాణలో గతం కంటే పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందనేది విశ్లేషణ.
కానీ, గతం కంటే పోలింగ్ తగ్గింది. బీజేపీ గణనీయంగా ఓట్లు దక్కించుకుంది. బీజేపీ పలు సీట్లలో మొదటి, రెండో స్థానంలో ఉండేలా ఓట్లు పడ్డాయనే విశ్లేషణ లు వస్తున్నాయి. బీజేపీ చీల్చింది ఎవరి ఓటు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ తో పాటుగా దక్కిచుకుండా..లేక..బీఆర్ఎస్ అనుకూల ఓటు కూడా తన వైపు మళ్లించుకుందా అనేదే ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతోంది.

హంగ్ వచ్చేనా..అధికారం దక్కేనా : ఈ లెక్కల పైన రెండు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ కి పడిన ఓటుతో తమకు నష్టం లేదనేది కాంగ్రెస్ వాదన. బీసీ నినాదం పని చేసి బీఆర్ఎస్ ఓటింగ్ చీలిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ ఓటింగ్ ఎంత మేర ఉంది. దాదాపు 30 నియోజకవర్గాల్లో బీజేపీ ఫలితాన్ని నిర్దేశించే స్థాయికి చేరిందని ఇరు పార్టీలు అంగీకరిస్తున్నాయి. తమ వ్యతిరేక ఓటునే బీజేపీ చీల్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ హైప్ చేసినంత స్థాయిలో అనుకూలత ఉంటే గతం కంటే దాదాపు 4 శాతం పోలింగ్ ఎలా తగ్గుందని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ కు సీట్లు పెరుగుతాయి కానీ అధికారంలోకి వచ్చే ఫిగర్ సాధించలేదరనేది అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. కానీ, ఓటింగ్ సరళి తమకు అధికారం ఖాయమని తేల్చుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఓటరు నాడి అర్దం కాని నియోజవకర్గాలు ఉన్నాయి. దీంతో..హంగ్ పైనా చర్చ సాగుతోంది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉంటాయా..లేక ఏకపక్షంగా ఉంటాయా అనేది 3న తేలనుంది.












Click it and Unblock the Notifications