Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. వరుస సెలవులు, పైగా ఏపీ ఇంటర్ ఫలితాలు రావడంతో స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలొచ్చారు. తిరుమలలో భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. నడక మార్గం, రోడ్డు మార్గంలో బిజీ కనిపించింది. నిన్న భారీగా భక్తులు నడక మార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. వారంతా దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇటు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో రద్దీ కనిపించింది.
భారీగా భక్తులు రావడంతో దర్శనానికి సమయం పడుతోంది. దివ్య దర్శన టికెట్ల కోసం భక్తులు వేచి చూస్తున్నారు. వైకుంఠం క్యా కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టు మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని క్యూలైన్లలో భక్తు వేచి ఉన్నారు. షెడ్డు దాటి క్యూలైన్ బయటకు వచ్చింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఎెండకాలం కావడంతో టీటీడీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది.

పాలు, మజ్జిక, అన్నప్రసాదం అందిస్తోంది. పలు చోట్ల చలువ పందిళ్లు కూడా వేశారు. నడక మార్గలలో వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు ఇచ్చే 5 వేల టోకెన్స్ అయిపోవడంతో భక్తులకు నిరాశతో కొండపైకి చేరుకున్నారు. 4 వేల టోకెన్స్ పూర్తి కావడంతో టీటీడీ టోకెన్స్ జారీ ప్రక్రియ నిలిపి వేసింది. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులకు సుమారు 7 గంటలు పడుతుంది. ఇక 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తలకు సుమారు 5 గంటలు వేచి చూడాల్సి వస్తుంది.
శనివారం తిరుమల శ్రీవారిని 82 వేల139 మంది భక్తులు దర్శించుకోగా.. ఇందులో 39 వేల 849 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లుగా ఉంది. కొద్ది రోజులు భక్తుల రద్దీ కొనసాగుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమలకు వచ్చే వారు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమలకు ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications