సీమలో పబ్లిక్ పల్స్ క్లియర్ - ఆ పార్టీకి డేంజర్ బెల్స్, వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ ఖాయమైంది. అటు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి సిద్దమైంది. సీఎం జగన్ ఒంటరిగానే ఎన్నికల యుద్దంలోకి దిగారు. ఈ సమయంలోనే రాయలసీమ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అనంతపురంలో సిద్దం సభ సక్సెస్ వైసీపీలో జోష్ పెంచింది. టీడీపీ, జనసేనలో సీమలో తమ పట్టు పైన అనుమానాలను పెంచింది.
రాప్తాడులో రీ సౌండ్
తాజాగా వైసీపీ రాప్తాడు కేంద్రంగా నిర్వహించిన సిద్దం సక్సెస్ కావటంతో వైసీపీలో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో రాయసీమలోని 52 నియోజకవర్గాల్లో టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అయింది. తిరిగి పట్టు పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో తమకు కలిసి వస్తుందని అంచనాలు వేస్తోంది. ఇక, వైసీపీ వరుసగా నిర్వహించిన మూడు సిద్దం సభలో టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గాల్లోనే నిర్వహించింది. భీమిలి, దెందులూరు, రాప్తాడు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా...గతంలో టీడీపీకి పట్టు ఉన్న ప్రాంతాలు. ఇక్కడ సభల ద్వారా తమ సత్తా చాటుకొనే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేసింది. ఇక, రాప్తాడు సభకు జాతీయ స్థాయిలోనూ ప్రచారం రావటంతో వైసీపీలో జోష్ పెరిగింది.

వైసీపీలో జోష్
రాప్తాడు సభకు రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి తరలి వచ్చారు. రాప్తాడు సభకు లక్షలాదిగా తరలి వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ రాప్తాడు సభ భారీగా ట్రెండింగ్ లో నిలిచింది. సభలో సీఎం జగన్ ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేసారు. తనకు బలం లేదని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, అదే నిజమైతే అసలు చంద్రబాబుకు పొత్తులు ఎందుకని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు తన పాలనలో చేసిన ఒక్క మంచి పనైనా చెప్పుకోవటానికి ఉందా అని నిలదీసారు. జగన్ వేదిక మీదకు వచ్చిన సమయం నుంచే మంచి స్పందన కనిపించింది. ప్రతీ ఇంటికి వెళ్లి ఈ 57 నెలల కాలంలో జరిగిన మంచి వివరించాలని జగన్ పార్టీ కేడర్ కు సూచించారు.

పబ్లిక్ మూడ్ క్లియర్
మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఒకసారి అవకాశం ఇస్తేనే ఈ స్థాయిలో మంచి చేసామని..మరోసారి అవకాశం ఇస్తే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, వైసీపీ సభకు వచ్చిన స్పందన గురించి టీడీపీ మద్దతు మీడియా వ్యతిరేకంగా ప్రచారం చేయటం పైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈశ సభ ద్వారా రాయలసీమలో జగన్ కు బలం చెక్కుచెదరలేదనేది స్పష్టమైందనేది వైసీపీ నేతల వాదన. ఈ సభ టీడీపీ-జనసేనకు డేంజర్ బెల్స్ అనే విశ్లేషణలు మొదలయ్యాయి. పాలనలో ఎక్కడా రాజీపడలేదని చెప్పిన జగన్..వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని కేడర్ కు దిశా నిర్దేశం చేసారు. రాప్తాడు సభకు హాజరైన జన సందోహం పైన జాతీయ మీడియాలో కథనాలు రావటంతో వైసీపీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications