ఆస్తి కోసం ఎంత పని చేశావు రఘునాథ రెడ్డి, లెక్చరర్ గా పని చేసినా బుద్దిమాత్రం ?
ఆస్తి పంపకాలలో తేడాలు వస్తే వెనుకా ముందు ఆలోచించకుండా ప్రాణాలు తీస్తున్నారు. ఆస్తి పంపకాలలో ముఖ్యంగా దాయాదుల మద్య గొడవలు వస్తుంటాయి. అయితే ఆస్తి పంపకాలు కుదరవని చెప్పిన కన్న తండ్రిని అతని కొడుకు నడిరోడ్డులో కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది భోజనం చేసి వాకింగ్ కు వెళ్లిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఆస్తులకు చాలా విలువ ఉంది. జగన్ సీఎం అయిన తరువాత అంత వరకు చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లె తరువాత అన్నమయ్య జిల్లాలో భాగం అయ్యింది. మదనపల్లె పట్టణంలోని పుల్లారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న మీరుగట్టు చిన్నరెడ్డప్ప రెడ్డి (65)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకొడుకు రఘునాథ రెడ్డి మదనపల్లెలోని ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేశాడు. ప్రస్తుతం ఉద్యోగం మానేసిన రఘునాథ రెడ్డి ఖాళీగా గాలికి తిరుగుతున్నాడు.

చిన్నరెడ్డప్ప రెడ్డి రెండో కుమారుడు శంకర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. నెలలో రెండుమూడు సార్లు వీకెండ్ లో మదనపల్లెకు వెలుతున్న శంకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపి తరువాత బెంగళూరు వెళ్లిపోతున్నాడు. చిన్నరెడ్డప్ప రెడ్డి పెద్ద కుమారుడు రఘునాథ రెడ్డి మాత్రం మదనపల్లెలోనే ఉంటూ కాలం గడుపుతున్నాడు.
ఆన్ లైన్ ట్రేడింగ్ చేసిన రఘునాథ రెడ్డి సుమారు రూ. 14 లక్షల వరకు అప్పుటు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు తమ డబ్బు తిరిగి ఇవవాలని ఒత్తిడి చెయ్యడంతో రఘునాథ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చేసిన అప్పులు తీర్చడానికి ఆస్తి పంపకాలు చెయ్యాలని రఘునాథ రెడ్డి అతని తండ్రి చిన్నరెడ్డప్ప రెడ్డి మీద ఒత్తిడి చేశాడు అయితే ఆస్తి పంపకాలకు చిన్నరెడ్డప్ప రెడ్డి, ఆయన చిన్న కుమారుడు శంకర్ రెడ్డి అంగీకరించలేదు.
ఇదే విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరగుతున్నాయని తెలిసింది. కొంతకాలం క్రితం ఆస్తి కోసం కన్న తండ్రి చిన్నరెడ్డప్ప రెడ్డి మీద చెయ్యి చేసుకోవడానికి రఘునాథ రెడ్డి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి తండ్రిని హత్య చెయ్యాలని రఘునాథ రెడ్డి ప్లాన్ చేశారని తెలిసింది. బుధవారం రాత్రి భోజనం చేసిన చిన్నరెడ్డప్ప రెడ్డి వాకింగ్ వెళ్లారు. అప్పటికే తండ్రి వస్తాడని రోడ్డు పక్కన వేసి చూస్తున్న రఘునాథ రెడ్డి రోడ్డు మీద తండ్రి చిన్నరెడ్డప్ప రెడ్డిని అడ్డగించి ఆస్తి ఎప్పుడు భాగాలు పెడుతావని గొడవకు దిగాడు.

తాను ఆస్తి ఇవ్వనని చిన్నరెడ్డప్ప రెడ్డి తేల్చి చెప్పారు. సహనం కోల్పోయిన రఘునాథ రెడ్డి అతని కారు తీసుకుని వెళ్లి వాకింగ్ చేస్తున్న తండ్రి చిన్నరెడ్డప్ప రెడ్డిని బలంగా డీకొట్టాడు. బెంగళూరులో ఉన్న తమ్ముడు శంకర్ రెడ్డికి ఫోన్ చేసి మీ నాన్నను చంపేశానని చెప్పాడు. భయపడిన శంకర్ రెడ్డి మదనపల్లెలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
కుటుంబ సభ్యులు, సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రి మొత్తం మదనపల్లెలోని పలు ప్రాంతాల్లో గాలించినా చిన్నరెడ్డప్ప రెడ్డి ఆచూకి చిక్కలేదు. గురువారం వేకువ జామున వీవర్స్ కాలనీలోని నిర్జనప్రదేశంలో చిన్నరెడ్డప్ప రెడ్డి శవమై కనిపించాడు. చిన్న రెడ్డప్ప రెడ్డి శవాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు పారిపోయిన రఘునాథ రెడ్డిని పట్టుకున్నారు. ఆస్తి కోసం కన్న కొడుకు చేతిలోనే తండ్రి హత్యకు గురికావడంతో మదనపల్లె ప్రజలు ఉలిక్రిపడ్డారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications