Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివేకా హత్య కేసులో సీఐ వాంగ్మూలం : ఒత్తిడి చేసారు -అవినాశ్ ఆ రోజు : ఆధారాలను వాళ్లే...!!

వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు దస్తగిరి చెప్పిన అంశాలు కీలకంగా మారాయని భావిస్తున్న వేళ..తాజాగా పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకు ఇచ్చని వాంగ్మూలం సైతం వెలుగులోకివచ్చింది. వివేకా హత్య ఘటన పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదని తనతో ఎంపీ అవినాశ్..శివ శంకరరెడ్డి..గంగిరెడ్డి తనతో చెప్పారంటూ సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కూడా పంపవద్దన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

వారి పర్యవేక్షణలోనే

వారి పర్యవేక్షణలోనే

వైఎస్ అవినాశ్ రెడ్డి..భాస్కర రెడ్డి..మనోహర్ రెడ్డి పర్యవేక్షణలోనే అక్కడ ఘటనా స్థలంలో ఆధారాల ధ్వంసం జరిగిందని స్పష్టం చేసారు. అవినాశ్ రెడ్డి తన పీఏ నెంబర్ నుంచి తనకు ఫోన్ చేసి వివేకా రక్తపు వాంతులు.. గుండె పోటుతో మరణించారని తనకు చెప్పారన్నారు. ఆ సమయంలో ఎవరూ లోపలకు వెళ్లకుండా లోపల నుంచి తలుపులు వేసారని పేర్కొన్నారు.

రక్తపు మరకాలు శుభ్రం చేయటం.. కుట్లు..బ్యాండేజ్ లు వేసే వారిని మాత్రమే అనుమతించారని వివరించారు. వివేకా డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఉంచి గాయాలు కనపడకుండా పూలతో కవర్ చేయాలని చూసారని శంకరయ్య తన వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తోంది.

గాయాలు ఉన్నాయని చెబితే

గాయాలు ఉన్నాయని చెబితే

తాను వివేకా మరణం విషయం స్థానిక డీఎస్పీకి తెలియజేసి ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు ఫోన్లు చేస్తుండగా... ఐదు నిముషాల్లోనే దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి మరోసారి తరకు ఫోన్‌ చేశారని చెప్పుకొచ్చారు. ఎందుకు ఆలస్యం అవుతోందంటూ కోప్పడ్డారని పేర్కొన్నారు. వివేకా శరీరం పైన గాయాలు చూసి గుండె పోటు తో మరణించినట్లుగా అనిపించటం లేదని తాను శివశంకరరెడ్డితో చెప్పగా.. నోర్మూసూకొని ఉండు..గాయాలు ఉన్నాయని ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయంటూ హెచ్చరించారని సీఐ శంకరయ్య తన వాంగ్మూలంలో వెల్లిడించారు.

పోస్టుమార్టం కు పంపాలని చెప్పినా

పోస్టుమార్టం కు పంపాలని చెప్పినా

వివేకా డెడ్ బాడీని బాత్రూమ్ నుంచి ఎర్ర గంగిరెడ్డి బయటకు తెచ్చారని..దుస్తులు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ..పోస్టుమార్టంకు పంపాలని చెప్పి..దుస్తులు మార్చవద్దని సూచించిన విషయాన్ని చెప్పారు. అయితే, నోర్మూసుకో..గాయాలు ఉన్నట్లుగా ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని తనను శివశంకర రెడ్డి బెదిరించారని చెప్పుకొచ్చారు. వివేకా వద్ద పని చేసే సహాయకుడు ఇనయతుల్లా సైతం వివేకా మరణం పైన అనుమానం వ్యక్తం చేయగా.. మీ సార్ కు ఎవరితోనూ శత్రుత్వం లేదు.. ఆయన్ను ఎవరూ హత్య చేసే అవకాశమే లేదంటూ శివశంకర రెడ్డి చెప్పారని సీఐ తన వాంగ్మూలంలో వివరించారు.

కీలకంగా సీఐ శంకరయ్య స్టేట్ మెంట్

కీలకంగా సీఐ శంకరయ్య స్టేట్ మెంట్

ఇక, ఈ మొత్తాన్ని వీడియో తీయమని తాను తన సిబ్బందికి సూచించగా.. వీడియో తీయటం ఆపేయాలంటూ శంకర రెడ్డి గట్టిగా కేకలు వేసారని సీఐ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం... అప్రూవర్ గా మారటం..తనకు ప్రాణహాని ఉందని చెప్పటం..ఇటువంటి అంశాల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన రాజకీయంగానూ చర్చలు మొదలయ్యాయి.

ఇక, ఇప్పుడు సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారుతోంది. దీంతో..ఇప్పుడు వివేకా కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయిది. సీబీఐ ఈ కేసును మరింత వేగవంతం చేసింది. దీంతో.. ఇప్పుడు సీబీఐ తదుపరి అడుగులు ఏంటనేది వూచి చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+