ఏపీలో దంచికొడుతున్నఎండలు.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..
ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జనం విలవిల లాడిపోతున్నారు. సోమవారం (ఏప్రిల్ 22) పలుచోట్ల సాధారణంకంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, నేడు మంగళవారం (ఏప్రిల్ 23) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మంగళవారం 43 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 104 మండలాల్లో వడగాడ్పులు, బుధవారం 20 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు 100 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయన్నారు.
నేడు విజయనగరంలోని 22మండలాల్లో, పార్వతీపురం మన్యం 11 మండల్లాల్లో, శ్రీకాకుళం 9 మండలాల్లోను, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోను తీవ్ర వడగాడ్పులు ఐఎండీ తెలిపింది. తూర్పు గోదావరిలోని 17మండలాలు, కాకినాడలోని 16 మండలాలు, అనకాపల్లిలోని 15 మండలాలు, శ్రీకాకుళంలోని 11 మండలాలు, అల్లూరి సీతారామరాజులోని 10 మండలాలు, ఏలూరులోని 9 మండలాలు, కోనసీమలోని 7మండలాలు, విజయనగరంలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యంలోని 4మండలాలు, విశాఖపట్నంలోని 4 మండలాలు, ఎన్టీఆర్ 3, పల్నాడు 2, గుంటూరు జిల్లాలో ఒక మండలంలోను, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోను తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక...
రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్రవైన వడగాల్పులతో జనం అల్లాడుతుంటే, మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వీటి వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో తీవ్ర ఉక్కపోత, అసౌకర్య వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు












Click it and Unblock the Notifications