జగన్ కేసుల్లో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు..!!

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతోందని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ విచారణ సమయంలో జగన్ కేసుల వివరాల పైన సుప్రీంకోర్టు ఆరా తీసింది. జగన్ కేసులకు సంబంధించి విచారణ వివరాలను రెండు వారాల్లో సమర్పించాలని ఈడీ, సీబీఐ ని న్యాయస్థానం ఆదేశించింది. అదే విధంగా కోర్టులో ఏ దశలో ఉన్నాయో వివరాలు కోరింది.

మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతోందని రఘురామ రాజు పిటీషన్ దాఖలు చేసారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీని పైన సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఇన్నాళ్లు ఎందుకు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజు వారీ పద్దతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నిర్ణయించిందని ఇరు పక్షాలు సుప్రీం ధర్మాసనంకు నివేదించాయి. రోజూ వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.

The Supreme court directed CBI and ED to submit Jagan cases status case posted on 13th December

డిశ్చార్జ్, వాయిదా పిటీషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణే ఆలస్యానికి కారణమని న్యాయవాదులు వివరించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని సూచించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు, పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+